Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్KTR fire on Revanth: జైల్లో ఉండాల్సిన రేవంత్ బయట తిరుగుతున్నారు

KTR fire on Revanth: జైల్లో ఉండాల్సిన రేవంత్ బయట తిరుగుతున్నారు

వెదవ పనికి సారీ చెప్పాలి

జైల్లో ఉండాల్సిన రేవంత్ రెడ్డి బయట తిరుగుతున్నారని కేటీఆర్ నిప్పులు చెరిగారు. చంచల్ గూడ జైల్లో క్రిశాంక్ ను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్‌ పై ఒక పనికిమాలిన కేసు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. అసలు తప్పు చేసి రేవంత్ రెడ్డి జైల్లో ఉండాల్సింది పోయి… బయట తిరుగుతున్నాడన్న కేటీఆర్.. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు పెట్టిన సర్క్యూలర్, క్రిశాంక్ పెట్టిన సర్క్యూలర్ ను నిపుణుల ముందు పెడదామని సవాలు విసిరారు.

- Advertisement -

ఏదీ వర్జినలో ఏదీ డూప్లికేటో తేలుద్దామన్న ఆయన.. ఆ తర్వాత ఎవరు చంచల్ గూడలో ఉండాలో తేలిపోతదన్నారు. క్రిశాంక్ పోస్ట్ చేసిన సర్క్యూలర్ తప్పా? చేయని తప్పుకు క్రిశాంక్‌ను జైల్లో వేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు. క్రిశాంక్ ను ఉద్దేశ పూర్వకంగానే జైల్లో వేశారని ఆరోపించిన కేటీఆర్ ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకొని చేసిన తప్పును సరిదిద్దుకోవాలన్నారు. సర్కార్ చేసిన వెదవ పనికి వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ తప్పు చేయని క్రిశాంక్ ను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని కేటీఆర్ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News