Monday, May 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Bethamcharla: పాణ్యం సిమెంట్ పరిశ్రమకు పునరుజ్జీవం

Bethamcharla: పాణ్యం సిమెంట్ పరిశ్రమకు పునరుజ్జీవం

ఫ్యాక్తరీ పునః నిర్మాణం కోసం నిద్రలేని రాత్రులెన్నో

బేతంచెర్ల మండలం సిమెంట్ నగర్ లో పాణ్యం సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణకు పడ్డ కష్టం అంతా ఇంతా కాదని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, ప్రతిపాదనలు ఇచ్చి, పరిశ్రమ ప్రభావం, చరిత్ర తెలిపి రాష్ట్ర విద్యుత్, మైనింగ్, వాణిజ్య పన్నుల శాఖలతో సమన్వయం చేసుకుని, కష్టపడి,పరిశ్రమను గాడిన పెట్టామన్నారు. పరిశ్రమను మూయించడానికి అడుగడుగునా ఆర్టీఐ చట్టం ద్వారా అనుమతులు లేవంటూ అడ్డం తగిలారన్నారు. మర్రి రమణ అనే తెలుగుదేశం పార్టీ మనిషి, పరిశ్రమ తెరవకుండా ఆటంకాలు సృష్టించి, ఫ్యాక్టరీ మూసివేతకు ప్రయత్నించారన్నారు.

- Advertisement -

ఇప్పుడు టీడీపీ వాళ్లు వచ్చి, పరిశ్రమలో ఉద్యోగాలిస్తామని చెప్పి, ఓట్లు అడగడం సిగ్గుచేటన్నారు. పరిశ్రమ మూయించాలనుకున్న వాళ్లు, ఉద్యోగాలిస్తామనడం విడ్డూరమన్నారు. కోర్టులు, కేసులు, అనుమతులు అడ్డుపడుతున్నా ప్రజలకిచ్చిన మాట కోసం, నిద్రలేని రాత్రులు గడిపానన్నారు. వలస వెళ్లిన సిమెంట్ నగర్ ప్రజలు, పరిశ్రమ పునరుద్ధరణ అనంతరం, సొంత ఊళ్లకు చేరడం, ఆ గ్రామానికి పున:వైభవం రావడంతో, తన కష్టం మరచిపోయానన్నారు. ప్రస్తుతం 80వేల టన్నుల సామర్థ్యంతో ఫ్యాక్టరీ నడుస్తుందని..త్వరలోనే 3 లక్షల టన్నులకు సామర్థ్యం పెంచి మరిన్ని ఉద్యోగవకాశాలందిస్తామన్నారు.

గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమం అందించడం కోసం వివిధ పథకాల కింద రూ.27 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. సిమెంట్ నగర్ ఎన్నికల ప్రచారంలో మంత్రి బుగ్గనతో పాటు మహిళలు భాగస్వామ్యమయ్యారు. బుగ్గానపల్లెలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి ప్రదాత బుగ్గన అంటూ నినాదాలు చేస్తూ, గజమాలతో గ్రామ ప్రజలు మంత్రి బుగ్గనను సత్కరించారు.

గ్రామ ప్రజలు మంత్రికి హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. మహిళలు ఎక్కువ సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు. బుగ్గానిపల్లె తండా యువత గోరుమానుకొండలో నెలకొల్పిన విద్యాలయాల్లో చక్కగా చదువుకోవాలన్నారు. ఉద్యోగవకాశాలు పెంచి యువత భవితను మారుస్తామన్నారు. మంచి చేసిన వారికి ఓటేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News