Sunday, May 19, 2024
Homeపాలిటిక్స్KTR @ Sirisilla: రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్లనే

KTR @ Sirisilla: రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్లనే

నాకు జోడీ దొరికితే..

ఈ ఉదయం సిరిసిల్ల పట్టణం శాంతి నగర్ లోనీ కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలుపుకోసం పలు వార్డులలో ప్రచారం నిర్వహించి, కార్నర్  మీటింగ్ పాల్గొనన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ సభకు భారీగా హాజరయ్యారు బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు.

- Advertisement -

ఈ సందర్భంగా కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు..నేత కార్మికుల కోసం 3 వేల కోట్ల రూపాయల ఖర్చు చేసుకొని కార్మికులను కాపాడుకున్నమన్న కేటీఆర్, 5 ఏళ్లలో ఒక్క రూపాయి, మందు పంచలేదన్నారు.  రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్లనే అన్న ఆయన.. సిరిసిల్ల పట్టణం అతి సుందరంగా తీర్చి దిద్దుకున్నామన్నారు. మీరు నన్ను ఇక్కడా గెలిపించిన కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి గెలిచిందన్నారు. మోచేతికి బెల్లం పెట్టి మోసపూరిత హామీలతో కాంగ్రెస్ గెలిచిందని, ఆరు గ్యారంటీలో ఒక్కటి అమలు చేసి మోగొల్లకు మహిళకు తకులాట పెట్టిండన్నారు. ఆరు గ్యారంటీలు అమలు అయ్యాయా చెప్పండని నిలదీసిన ఆయన.. అబద్ధాలు చెపితే డిజిటల్ ప్రపంచలో ఒక్క నిమిషాల్లో  దొరికిపోయారన్నారు. కెసిఆర్ ప్రభుత్వం పోయాక అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వచ్చిందని, తెలంగాణ తెచ్చిన కెసిఆర్ ను పట్టుకొని  కాంగ్రెస్ పార్టీ అనేక మాటలు, బూతులు మాట్లాడుతున్నారన్నారు.

100 రోజుల్లో రైతు రుణమాఫీ, ఫించన్లు వచ్చాయా అంటూ..ఓట్లు చేసుకునేటప్పుడు ఒక లెక్క ఓట్లు వేయించుకున్నాకా ఒక లెక్క ఉంది కాంగ్రెస్ పార్టీ తీరు అన్న ఆయన.. కెసిఆర్ మల్ల కావాలంటే 13 తేదీన కారు గుర్తుకు వేసి గెలిపించాలని, తెలంగాణలో శాసించే అధికారం వస్తుందన్నారు. వేములవాడ రాజన్న, కొండగట్టు దేవాలయాలు బిజెపి పుట్టక ముందు నుండే ఉండేవని, సిరిసిల్లలో అనేక అభివృద్ధి పనులు చేసినా, బీజేపీ ఒక్క పని చేసిండా శిలాఫలకం అన్న వేసిండా వారికి ఎందుకు ఓటు వేయాలన్నారు. మనకు ప్రధాన మంత్రి కాదు ఫైరమైన ప్రధాన మంత్రి అంటూ..అక్కరికి  రానీ సుట్టాలకు ఎందుకు ఓటు వేయాలన్నారు. నాకు జోడి దారు దొరికితే రాష్ట్రం, కేంద్రంపై పోరాడే శక్తి వస్తుందని కేటీఆర్ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News