Friday, April 4, 2025
Homeపాలిటిక్స్Kuna Srisailam joins Cong: కుత్బుల్లాపూర్ లో బీజేపీకి భారీ షాక్

Kuna Srisailam joins Cong: కుత్బుల్లాపూర్ లో బీజేపీకి భారీ షాక్

సొంత గూటికి చేరిన కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ లోని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, కూన శ్రీనివాస్ గౌడ్, రాము గౌడ్, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కొలను హనుమంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి, జ్యోత్స్న రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ అవ్వగా కూన శ్రీశైలం గౌడ్ తో పాటు ఈ భేటీలో కాంగ్రెస్ నేతలు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, కోలన్ హన్మంత్ రెడ్డి,నర్సారెడ్డి భూపతి రెడ్డి, కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్,చరణ్ కౌశిక్ యాదవ్,రాము గౌడ్, కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News