Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Muthireddy: గోచి, గొంగడితో తిరుగుతా-ఎమ్మెల్యే ఛాలెంజ్

Muthireddy: గోచి, గొంగడితో తిరుగుతా-ఎమ్మెల్యే ఛాలెంజ్

అభివృద్ధి జరగలేదని నిరూపించండి మరి

రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి గోచి గొంగడితో తిరుగుతానని ప్రతిపక్ష పార్టీలకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సవాళ్లు విసిరారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో వడ్డెర కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయలు మంజూరుచేసి భూమి పూజ చేశారు. కొమురవెల్లి మండలం కిష్టంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, స్వాత్రంత్య సమరయోధుల విగ్రహాలను ప్రారంభించారు.

- Advertisement -

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ పల్లెల్లో అభివృద్ధి జరగలేదని ప్రతిపక్ష నాయకులైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిలు నిరూపిస్తే గోషి గొంగడి ధరించి జీవితాంతం రాష్ట్రంలో తిరుగుతానాని సవాల్ విసిరారు. తెలంగాణలో రైతు బంధు,పెన్షన్, కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, రైతు రుణ మాపీ లాంటి పథకాలతో ఒక్కో గ్రామానికి కోట్ల రూపాయల నిధులను కేటాయించి 9 ఏళ్లుగా అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కతుందన్నారు.

ఎంపీలుగా ఉన్న రేవంత్ రెడ్డి,కిషన్ రెడ్డిలకు దమ్ము,దైర్యం ఉంటే కేంద్రం నుండి రాష్ట్రానికి రావలసిన 94 వేల కోట్లను తీసుకురావాలని అన్నారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటనలో కేవలం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు కానీ రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్ట్ లకు ఎలాంటి హోదా కల్పిస్తారో ప్రకటించలేదన్నారు. కిషన్ రెడ్డికి సోయి ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులలో దేనికి జాతియ హోదా తెస్తావో చెప్పాలని ప్రశ్నించారు. కిష్టంపేట గ్రామ అభివృద్ధిని చూసి గ్రామ సర్పంచ్ పాలకమండలికి ప్రశంసల జల్లు కురిపించారు. జిల్లా కలెక్టర్, మంత్రి హరీష్ రావుకి గ్రామ అభివృద్ధి గురించి మరియు గ్రామం ఆదర్శ గ్రామంగా అవార్డు దక్కాలని ప్రపోజల్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ మహిళలు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News