Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Modism: సూఫీ నైట్స్, చర్చిల సందర్శన, వాల్మీకి జయంతి సెలబ్రేట్ చేయండి..మోడీ హితబోధ

Modism: సూఫీ నైట్స్, చర్చిల సందర్శన, వాల్మీకి జయంతి సెలబ్రేట్ చేయండి..మోడీ హితబోధ

ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల వ్యూహం మామూలుగా లేదు. ఇప్పటికే అనవసర వివాదాల్లో తలదూర్చద్దని.. ముఖ్యంగా పఠాన్ వంటి సినిమా వ్యవహారాలపై పార్టీకి తలనొప్పులు తేవద్దని పార్టీ శ్రేణులను గట్టిగా హెచ్చరించారు.

- Advertisement -

అంతేకాదు మైనారిటీల దగ్గరికి వెళ్లాలని.. ప్రతిఫలం ఆశించకుండా వారందరినీ అక్కున చేర్చుకోవాలని చెప్పి వారం కూడా తిరక్కముందే మరో కొత్త దిశా నిర్దేశం చేశారు మోడీ. సూఫీ మ్యూజికల్ నైట్స్ ఏర్పాటు చేయాలని.. మోడీ హితబోధ చేస్తుండటం విశేషం. అంతేకాదు చర్చిలకు వెళ్లాలని కూడా ఆయన పిలుపునివ్వటం కార్యకర్తలకు షాక్ ఇస్తోంది. వాల్మీకి జయంతిని ఆర్భాటంగా జరపాలని కూడా ప్రధాని మోడీ పార్టీకి దిశా నిర్దేశం చేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలన్న కసితో ఉన్న మోడీ ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలకు బీజేపీని చేరువ చేయాలని తెగ తాపత్రయ పడుతున్నారు. అందుకే మైనారిటీ మంత్రాన్ని పదేపదే జపిస్తూ వారి కంట్లో పడుతున్నారు. అన్ని కులాలు, మతాలు, వర్గాల వారి విశ్వాసాన్ని చూరగొనేలా పార్టీ కార్యకర్తలు కృషిచేయాలన్నారు మోడీ. పెన్షనర్లు, యూనివర్సిటీ విద్యార్థులతో తరచూ భేటీ కావాలని.. వారందరితో కలుపుగోలుతనాన్ని ప్రదర్శించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News