Saturday, May 18, 2024
Homeపాలిటిక్స్Natti Kumar letter to EC: ఎన్నికల కమీషన్ కు లెటర్ రాసిన నట్టికుమార్

Natti Kumar letter to EC: ఎన్నికల కమీషన్ కు లెటర్ రాసిన నట్టికుమార్

ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయి

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలు క్షీణించాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర బలగాలను దించేలా తగిన చర్యలు చేపట్టాలని ఎన్నికల కమీషన్ కు రాసిన లేఖలో సీనియర్ నిర్మాత, దర్శకుడు, విశాఖపట్నం మాజీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే నట్టి కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎన్నికల కమీషన్ కు తాను రాసిన లెటర్ గురించి ఆయన వివరిస్తూ… .

- Advertisement -

“ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై ఓ ఆగంతకుడు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఐదు కోట్ల మంది ప్రజలు ఈ దాడిని చూసి నిర్గాంతపోయారు. సాధారణంగా సీఎంను కలుసుకోవాలన్నా, మాట్లాడాలన్నా ఒకటికి ఐదు ఇంతల సెక్యూరిటీ ఉంటుంది. ఆయన ప్రజలలోకి వచ్చి, ఎక్కడ సభలు పెట్టినా, దాదాపు అర కిలోమీటర్ వరకు పూర్తి బందోబస్తు ఉంటుంది. సీఎం సభలకు దగ్గరలో ఉండే ఇళ్ళు, స్కూల్స్, ఇతర వ్యాపార కార్యాలయాలు వేటినైనా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని జల్లెడపడతారు.
.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం పరిపాటి. అయితే 50 ఫీట్స్ దూరం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి పై రాయితో దాడి జరిగింది అని అంటున్నారు. నిజంగా రాయి అయితే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని అంటున్నారు. రాయి కాకుండా రబ్బర్ షూటర్ కావచ్చు అని కూడా వినిపిస్తోంది. 50 ఫీట్స్ నుంచి దాడి జరిగితే సెక్యూరిటీ ఎందుకు పసిగట్ట లేకపోయారు. సభకు దగ్గరలో ఉన్న స్కూల్ పై నుంచి ఆ ఆగంతకుడు దాడి జరిపిన తర్వాత మేడపై నుంచి కిందకు దిగేలోపు ఎందుకు అతడిని పట్టుకోలేదు. అసలు ఆ స్కూల్ ను ముందుగా తమ అధీనంలోకి సెక్యూరిటీ ఎందుకు తీసుకోలేదు. ఆ ఏరియాలో ఒక ముఖ్యమంత్రి సభ జరుపుతుంటే కరెంటు ఎందుకు పోయిందన్న కారణం గురించి సంబంధిత అధికారులు అయిన ADE, AE లను విచారించారా?. వారు ఎవరెవరితో ఆ సమయంలో ఫోన్స్ లో మాట్లాడారో అనే విషయంపై ఎంక్వయిరీ జరిపారా?. అలాగే అక్కడి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను ఏం జరిగిందన్న అంశంపై ప్రశ్నించారా? సీఎం సభ పెట్టిన ప్రదేశంలోనే డీసీపీ, పోలీస్ కమీషనర్ స్థాయి అధికారులు ఉన్నారు.. రాయి కానీ మరేదైనా రబ్బర్ అయినా తగులుతుడు సీఎం వెనుక ఉన్న సెక్యూరిటీ ఎందుకు కాపాడలేకపోయారు. వాళ్ళు ప్రత్యేక కళ్ళ అద్దాలతో దూరం నుంచి ఏం రాబోతోందో ముందే పసిగట్టగలుగుతారు. సీఎంకు తగిలినది రాయినో ఇంకేదో తెలుసుకోలేక, దానిని కనిపెట్టడానికి బహుమతి ఇస్తామంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపైనే ఇలా జరిగితే సామాన్య ప్రజలకు రక్షణ ఏది? దాదాపు 1400 మంది పోలీస్ బందోబస్తు ఎం చేస్తున్నట్లు?.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమంత్రి పాల్గొన్న సభలో కూడా సెక్యూరిటీ పరంగా ఫెయిల్యూర్స్ కనిపిస్తే, తమరు అనగా ఎలక్షన్ కమీషన్ జోక్యం చేసుకుని కొంతమంది అధికారులను వీఆర్ కు పంపించడం, ట్రాన్సఫర్ చేయడం జరిగింది.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు పైన విశాఖపట్నంకు సమీపంలోని గాజువాకలో సభ జరిపితే, అక్కడ కొందరు దుండగులు రాళ్ళు విసరడం జరిగింది. అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ పైన తెనాలి సభలో కొందరు రాళ్ళు విసరడం జరిగింది. అక్కడ సెక్యూరిటీ లోపం కనిపించింది. ఇక సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా పేద ప్రజలకు అందజేసే పెన్షన్స్ కు సంబంధించి వాలంటీర్లు ద్వారా కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రభుత్వ అధికారుల ద్వారా పంపిణీ చేయమని ఎలక్షన్ కమీషన్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారిని ఆదేశిస్తే…దానిని రోడ్డుపైకి తీసుకుని వచ్చారు. దానివల్ల మండిపోయే ఎండలలో కొందరు ప్రజలు ఎండ బెట్ట కొట్టి చనిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి కారణం ప్రతిపక్ష పార్టీల వారు అని రాజకీయ ఆరోపణలను అధికార పార్టీ వారు చేయడం మొదలు పెట్టారు.. అసలు ఈ కుట్రలన్నీ ప్రతిపక్ష పార్టీలపై నెట్టి, అధికార పక్షం వారు పబ్బం గడుపుకుంటున్నట్లు జనాలలో ప్రచారం జరుగుతోంది. వీటన్నింటిపైనా పూర్తి స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమీషనర్ అయిన తమకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈసారి కేంద్ర బలగాల సహాయంతో ఈసారి పోలింగ్ జరిపించాలి.

ఇంకా ఇదే సమావేశంలో నట్టి కుమార్ వివిధ అంశాలపై మాట్లాడారు. “కోడికత్తి కేసు ఇంతవరకు తెలింది లేదు. దాడి వెనుక కారణాలు ఏంటో బయటకు రాలేదు.. అలాగే వై.ఎస్. వివేకా గారి హత్య వెనుక కారణాలు బయటకు రాలేదు. వివేకా మర్డర్ గురించి జగన్ కు తెలుసు..వైఎస్.సునీత, వై.ఎస్ షర్మీల ప్రశ్నలకు జగన్ దగ్గర సమాధానాలు లేవు. విమలమ్మ‌ వన్ సైడెడ్ గా‌ మాట్లాడారు ..ఇదంతా జరుగుతుండగానే జగన్ కు రాయి తగిలింది. ఆ రాయి దెబ్బ వెల్లంపల్లికి కూడా తగిలిందని ఓ కన్ను మూసేశారు.

సినీ పరిశ్రమ స్పందించడం లేదు

ఇక సినీ పరిశ్రమ విషయానికి వస్తే, ఫోన్ ట్యాపింగ్ కేసులో నిర్మాత నవీన్ ఎర్నేని‌ పేరు ఓ కేసులో వినిపించింది..ఆయనపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఛాంబర్ స్పందించ లేదు..నవీన్ వందల కోట్లతో సినిమాలు చేస్తున్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణలల్లో నిజం ఎంతో తేలాలి. ..ప్రతిసారి ఇండస్ట్రీ పేరు ఎందుకు వస్తుంది.‌ మరలా క్లీన్ చీట్ ఎందుకు ఇస్తున్నారు. డ్రగ్స్ ఆరోపణలలో కూడా ఇండస్ట్రీ పరువు తీసిన పోలీసులపై ఎందుకు యాక్షన్ తీసుకోలేదు. సినిమా పరిశ్రమను టార్గెట్ చేస్తుంటే, సినీ పెద్దలు ఖండించటం లేదు ..తప్పుడు అభియోగాలను ఇండస్ట్రీ సీరియస్ గా తీసుకొవాలి..డ్రగ్స్ ను ఎవరూ సహించేది లేదు..నిందితులకు శిక్ష పడాల్సిందే. సినిమా వారిపై దయచేసి అభాండాలు వేయటం కరెక్ట్ కాదు. చేస్తే సరైన విచారణ జరపాలి” అంటూ ముగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News