Saturday, July 6, 2024
Homeపాలిటిక్స్Sankarpalli No confidence motion: అవిశ్వాస తీర్మానం దిశగా శంకర్ పల్లి మున్సిపాలిటీ

Sankarpalli No confidence motion: అవిశ్వాస తీర్మానం దిశగా శంకర్ పల్లి మున్సిపాలిటీ

చైర్మన్ పదవి కోసమేనా పార్టీలు మారడం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడిన మున్సిపల్ లో ఒకటైన శంకర్ పల్లి మున్సిపల్ లో అవిశ్వాస తీర్మానం జరగబోతుందని రోజురోజుకు పెరుగుతున్న కాంగ్రెస్ పార్టీ సంఖ్యా బలంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ లో వారిలో పెరిగిన ఆత్మ విశ్వాసం వారిలో కొత్త ఆశ బలంగా ఏర్పడినది. ఇదే నిజం అయితే నూతనంగా ఏర్పడిన శంకర్ పల్లి మున్సిపల్ లో అవిశ్వాస తీర్మానం తప్పదా? కేవలం మూడు సీట్లతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానంలో తన బలాన్ని నిరూపించకపోతుందా?.

- Advertisement -

తమ పని తాము చేసుకుపోతుంటే..

కొత్తగా ఏర్పడిన శంకర్ పల్లి మున్సిపల్ నేటికీ మూడేళ్ల కాలంలో టిఆర్ఎస్ పార్టీ తరఫున 15 వార్డ్లకు గాను 12 వార్డులలో తన అభ్యర్థులను గెలిపించుకొని, వీరితో పాటు ఇద్దరు కో అపషన్ మెంబెర్స్ తో సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ కొత్త గా ఏర్పడిన శంకర్ పల్లి మున్సిపల్ కి చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. వైస్ చైర్మన్ గా బి.వెంకటరామిరెడ్డి తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు ఇప్పుడు వేంకట్రాంరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు, కేవలం ముగ్గురితో ఉన్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తమ పని తాము చేసుకుంటూ పోయారు. ఇప్పుడు బి ఆర్ ఎస్ నుండి వచ్చిన కౌన్సిలర్లతో కలసి సమయం కోసం వేచి చుసి అవిశ్వాస దిశగా ప్రయాణిస్తునారు. నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బి ఆర్ఎస్ పార్టీ నాయకుల చూపు కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళింది. ఇందులో భాగంగా చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశించి వచ్చిన మాజీ జడ్పీటీసీ చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి తన అనుచరులను తీసుకు రావడంతో బిఆర్ఎస్ పార్టీలో చీలికలు ఏర్పడినా తను ఇంకా బి ఆర్ యస్ కొనసాగుతున్న మున్సిపల్ చైర్మన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి రాకపోవడంతో ఇదే అదునుగా భావించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీకి బలం చేకురిందని భావించి కాంగ్రెస్ పార్టీ నాయకులకు చైర్మన్ పీఠంపై కన్ను పడింది ఇందులో భాగంగా తమకు అవిశ్వాస తీర్మానానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది ఇందులో టిఆర్ఎస్ నుంచి వచ్చిన కౌన్సిలర్లకు కూడ చైర్మన్ కొరకు శతప్రయత్నాలు చేస్తున్నట్టు గుసగుసలు వినపడుతున్నాయి.

ఇదే కనుక నిజం అయితే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల మధ్య చైర్మన్ పదవి కోసం పోటీ నెలకొననుంది మరి పోటీ పడుతున్న కౌన్సిలర్ లో ఎవరికీ ఈ చైర్మన్ పీఠం దక్కేనో వేచి చూడాలి మరి ఏది ఏమైనా నూతనంగా ఏర్పడిన శంకర్ పల్లి మున్సిపల్ లో మొదటిసారి గానే అవిశ్వాస తీర్మానం జరుగుతున్నదని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు.

మున్సిపాలిటీపై పట్నం పట్టుందా?

రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి హావా కొన్నాసాగేనా ? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో రాజకీయ పరంగా తన పట్టు చూపియాలని, అలాగే తన భార్యకు పట్నం సునీత మహేందర్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశించిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తన బలం చూపించుకోవడానికి ఇదే సరైన సమయంలో భావిస్తున్నారని, అవిశ్వాస తీర్మానంలో నెగ్గి కాంగ్రెస్ పార్టీకి శంకర్ పల్లి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అందించి, రంగారెడ్డి జిల్లాలో తనదే పైచేయని ఆయన అధిష్టానానికి తెలియజేయాలని చూస్తున్నట్లుగా ఉందని ఇక్కడ ప్రజల భావన. మరి అవిశ్వాస తీర్మానంలో నెగ్గి రంగారెడ్డి జిల్లాలో తనదే పైచేయని మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి నిరూపించుకుంటారో చూడాల్సిందే.

బీఆర్ఎస్ కు బలం ఉందా ?

లేక చైర్మన్ పదవిని వాదులుకొంటుందా ? శంకర్ పల్లి మున్సిపల్ చైర్మన్గా కొనసాగుతున్న సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ మొదటి నుండి టిఆర్ఎస్ పార్టీ కి అనుక్షణం ఒక విశ్వాస నాయకులుగా ఉండి ఇప్పుడు ఉన్న టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ లు తనకు అండగా ఉండేనా, నూతనంగా ఏర్పడిన శంకర్ పల్లి మున్సిపాల్ కి ఇప్పటి వరకు ముగ్గురు కమిషనర్ వచ్చి వెళ్లిన తన పట్టు విడవకుండా తన టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లతో పాటు కలసి శంకర్ పల్లి మున్సిపల్ అభివృద్ధికి ఆమె చేసిన ప్రయత్నం ఆమెను ఈ అవిశ్వాస తీర్మానం నుండి బయటపడడానికి మార్గమని ఇక్కడ ప్రజల భావన.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News