మా డాడీకి ఒక్కసారి ఓటేస్తే.. హుజురాబాద్ ని హైదరాబాద్ ల చేస్తాడని కౌశిక్ రెడ్డి కూతురు శ్రీనిక రెడ్డి ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ గా సందడి చేయటం హైలైట్.
మా డాడీని చిన్నప్పుడు అడిగేదాన్ని డాడీ ప్రపంచంలో ఎన్నో ఉద్యోగాలు ఉండగా మీరు ఈ ఉద్యోగమే ఎందుకు ఎంచుకున్నారని, డాడీ చెపుతుంటే నాకు అప్పుడు అర్థం కాలేదు. డాడీ అప్పుడు అలా ఎందుకు చెప్పాడు ఇప్పుడు డాడీని చూస్తే అర్థమయిందని హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి కూతురు శ్రీనిక రెడ్డి అన్నారు. ఎప్పటికైనా హుజురాబాద్ ని హైదరాబాద్ ల చేయాలని అప్పుడు అన్నమాట ఇప్పుడు గుర్తొస్తున్నాయి. మా డాడీకి ఓటు వేసి గెలిపిస్తే హుజురాబాద్ నీ హైదరాబాద్ గా తీర్చిదిద్దుతాడని నాకు నమ్మకం ఉందని ఒక్కసారి మా డాడీకి ఓటు వేయరా ప్లీజ్ అని ప్రజలను కోరింది. దీంతో ఆ చిన్నారి మాటలకు సభా ప్రాంగణమంతా ఒక్కసారిగా కేరింతలు చేస్తూ చప్పట్లు కొడుతూ జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఆ పాప మాటలకు అక్కడున్న వారంతా ఈసారి ఓటు మీ డాడీకే వేస్తామని మా సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ పార్టీకే ఉంటుందని చెప్పారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నుంచి బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి మీ కళ్ళముందే కనిపిస్తుందని, అభివృద్ధి చూసే మరొకసారి బిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని ఎమ్మెల్సీ, హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. జమ్మికుంట మండలం పాపయ్యపల్లి, బిజిగిరిషరీఫ్, నాగంపేట్, శాయంపేట గ్రామాలతో పాటు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 1, 2 వార్డులలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సమావేశాలలో ఆయన మాట్లాడారు. జమ్మికుంట నాయిని చెరువు టూరిజం స్పాట్ గా మారుస్తానని హామీ ఇచ్చారు. క్రీడాకారుల కోసం బ్రహ్మాండమైన స్పోర్ట్స్ గ్రౌండ్ ఏర్పాటు చేసుకుందామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మాణంతోపాటు పోలీస్ స్టేషన్ కూడా ఆధునికరించుకుందాం అన్నారు. ఒక్క అవకాశం ఇస్తే హుజురాబాద్ నియోజకవర్గం రూపు రేఖలు మార్చి చూపిస్తానని, హుజురాబాద్ నియోజకవర్గం మరో సిద్ధిపేటలో మార్చి చూపిస్తానన్నారు.
అప్పుడు జాతీయ జెండా, ఇప్పుడు గులాబి జెండా-కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని రెడ్డి
ఒకప్పుడు క్రికెట్ ఆడి కౌశిక్ రెడ్డి జాతీయ జెండా మోశాడని, ఇప్పుడు బిఆర్ఎస్ గులాబీ జెండా పట్టుకొని హుజురాబాద్ నియోజకవర్గ బరువు బాధ్యతలు మోయాలనుకుంటున్నాడని కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని రెడ్డి అన్నారు. 15 ఏళ్లుగా హుజురాబాద్ నియోజకవర్గం తన సొంతింటిల ఎప్పుడు ఎవరికి ఆపద వచ్చినా నేను ఉన్నానని సేవలందిస్తారన్నారు. ఒక్కసారి అవకాశం కల్పిస్తే హుజురాబాద్ నియోజకవర్గం పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తారని అన్నారు.