Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Pathikonda: కంగాటి శ్రీదేవిని మంత్రిగా చూడాలి

Pathikonda: కంగాటి శ్రీదేవిని మంత్రిగా చూడాలి

రెండోసారి బరిలోకి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ 175 అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లును ప్రకటించారు. అందులో భాగంగా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి ఎమ్మెల్యే పేరు రెండవసారి ఖరారు చేయడంతో పత్తికొండ మండల పరిధిలోని హోసూరు వైఎస్ఆర్సిపి నాయకులు బనగాని శ్రీనువాసులు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి నాయకుల సంబరాలు జరుపుకున్నారు.

- Advertisement -

అనంతరం వారు మాట్లాడుతూ జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమను పెద్ద ఎత్తున భారీ మెజారిటీతో గెలిపిస్తామని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే ను మంత్రిగా చూడాలనేదే మా కోరిక అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తిరునాలలో సందడి చేసిన ఎమ్మెల్యే.

పత్తికొండ మండల పరిధిలోని పుల్లికొండ గ్రామంలో వెలసిన సంతాన వరుడు శ్రీ శ్రీ రంగస్వామి తిరుణాల సందర్భంగా ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు వేద పండితుల చేత ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వదించారు. అనంతరం శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నారాయణదాసు, మాజీ సర్పంచ్, తిప్పన్న పులికొండ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News