Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Rahul: ఆ రాహుల్ గాంధీని చంపేశా అంటున్న రాహుల్

Rahul: ఆ రాహుల్ గాంధీని చంపేశా అంటున్న రాహుల్

మీకు తెలిసిన రాహుల్ గాంధీని నేను చంపేశానంటూ రాహుల్ గాంధీ సరికొత్తగా మాట్లాడుతున్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా హర్యానాలో సాగుతున్న పాదయాత్రలో మాట్లాడిన రాహుల్ తాను పూర్తిగా మారిపోయి సరికొత్త రాహుల్..అని చెప్పకనే చెప్పారు. తాను పూర్తిగా మారినట్టు, తాను చెప్పే విషయం అర్థం కాకపోతే హిందూయిజంను తెలుసుకోమని జర్నలిస్టుకు రాహుల్ చెప్పటం విశేషం. రాహుల్ గాంధీ కేవలం బీజేపీ వాళ్ల బుర్రల్లోనే ఉన్నాడని రాహుల్ తన ఇమేజ్ పై లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు.

- Advertisement -

“ఇమేజ్ పై నాకు ఎటువంటి ఆసక్తి లేదు.. దాంతో నాకేం పనిలేదు. మీకు నాపై ఎటువంటి ఇమేజ్ కావాలంటే అలాంటి ఇమేజ్ పెట్టుకోండి..మంచి ఇమేజ్ లేదా చెడ్డ ఇమేజ్.. ఏది కావాలంటే అదే పెట్టుకోండి..అది మీ ఆలోచన నాది కాదు..దాంతో నాకు వచ్చే నష్టమేం లేదు.. నా పని నేను చేసుకుంటూ పోతా”.. అంటూ రాహుల్ చెప్పటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News