Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్Karimnagar Congress: అమెరికాలో కరీంనగర్ కాంగ్రెస్ పై రాహుల్ తో చర్చించిన నిఖిల్

Karimnagar Congress: అమెరికాలో కరీంనగర్ కాంగ్రెస్ పై రాహుల్ తో చర్చించిన నిఖిల్

అమెరికాలో కరీంనగర్ రాజకీయాలపై గరంగరం చర్చ, చర్చలో పాల్గొన్న రాహుల్ గాంధీ

భారత కాలమానం ప్రకారం నిన్న అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యు.ఎస్.ఏ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటు అమెరికా పర్యటనలో ఉన్న కరీంనగర్ మాజీ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జువ్వాడి నిఖిల్ చక్రవర్తి హాజరై రాహుల్ గాంధీని కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ నిఖిల్ చక్రవర్తిని ఆప్యాయంగా పలకరిస్తూ తానే స్వయంగా ఫోటో దిగారు.

- Advertisement -

రాహుల్ గాంధీతో పాటు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కి, పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యారు. నిఖిల్ చక్రవర్తితో పాటు నాయకులంతా కలిసి రాష్ట్ర, జిల్లా రాజకీయాల గురించి చర్చించారు. అమెరికా పర్యటనలో ఉన్నప్పటికీ జిల్లా రాజకీయాలపై దృష్టి సారించిన నిఖిల్ చక్రవర్తి ని రేవంత్ రెడ్డి అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News