Thursday, July 4, 2024
Homeపాలిటిక్స్Rajanna Sirisilla: సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా చేస్తాం

Rajanna Sirisilla: సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా చేస్తాం

తెలంగాణలోనే అతిపెద్ద ఆక్వా హబ్ ఇక్కడే

దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందన్నారు మంత్రి కేటీఆర్. శ్రీ రాజరాజేశ్వర జలాశయ కేంద్రంగా, 366 ఎకరాల విస్తీర్ణంలో 2 వేల కోట్ల భారీ పెట్టుబడి పెడుతున్నట్టు కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణలోనే అతిపెద్ద ఆక్వా హబ్ ఏర్పాటు కానుందంటూ కేటీఆర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల ఆవరణలో తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

- Advertisement -

అతిపెద్ద ఆక్వాహబ్
తెలంగాణ మత్స్యరంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకానుందని స్వాతంత్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో పేర్కొన్నారు. ఇప్పటికే చేప పిల్లల ఉచిత పంపిణీతో మత్స్య రంగం దశ దిశలు మార్చిన తెలంగాణ ప్రభుత్వం, మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. శ్రీ రాజరాజేశ్వర జలాశయం కేంద్రంగా 2 వేల కోట్ల భారీ పెట్టుబడితో 10 వేల మందికి ఉపాధినిచ్చేలా మధ్యమానేరులో 366 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద అక్వాహబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం అని అన్నారు. దీని ద్వారా 5,000 మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అక్వాహబ్ ను జిల్లాలో కొత్తగా రానున్న రైల్వే ప్రాజెక్టుతో అనుసంధానం చేయనున్నాం.జలవిప్లవానికి తోడు మరో నాలుగు విప్లవాలు రాష్ట్రంలో చేపడుతున్నట్టు ఆయన నొక్కి చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News