Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Rajasthan: పైలట్ కు కాంగ్రెస్ స్ట్రాంగ్ వార్నింగ్, చర్యలు తప్పేలా లేవు

Rajasthan: పైలట్ కు కాంగ్రెస్ స్ట్రాంగ్ వార్నింగ్, చర్యలు తప్పేలా లేవు

ఓవైపు ఎన్నికలు తరుముకొస్తున్నాయి.  మరోవైపు కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నారు.  అశోక్ గెహ్లాట్ వర్గంపై విరుచుకుపడే వ్యూహంలో భాగంగా పైలట్ ఈరోజు ఒక్కరోజు నిరాహార దీక్ష తలపెట్టారు. రాష్ట్రలో జరిగిన అవినీతి, కుంభకోణాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలంటూ ఆయన దీక్షకు కూర్చొంటున్నారు.  అయితే ఇదంతా పార్టీ వ్యతిరేక చర్యల కిందికి వస్తుందని, ఇలాంటి దుందుడుకు చర్యలు మానుకోవాలని హైకమాండ్ పైలట్ ను హెచ్చరించింది.  కానీ ఇవన్నీ బేఖాతరు చేస్తున్న పైలట్ మాత్రం తన నిరాహార దీక్షను యతాతథంగా కొనసాగించనున్నారు. 

- Advertisement -

అశోక్ గెహ్లాట్ ను సీఎం పదవి నుంచి తప్పించి తనను సీఎం చేయాలంటూ క్యాంప్ రాజకీయాలు చేస్తున్న సచిన్ పైలట్ పార్టీ హైకమాండ్ చేష్టలతో విసిగి వేసారిపోయారు.  పార్టీని వీడలేక, కొనసాగలేక, తన వర్గం ఎమ్మెల్యేలకు పదవులు దక్కక, పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవటంతో ఆయన చాలాకాలంగా నలిగిపోతున్నారు. రాహుల్ గాంధీకి సన్నిహితుల్లో ఒకరిగా పైలట్ కు ముద్ర ఉన్నప్పటికీ ఈ విషయంలో ఆయనకు రాహుల్ నుంచి ఎటువంటి మద్దతు లభించలేదు. దీంతో రీసార్ట్ రాజకీయాలు చేసినా ఫలితం దక్కలేదు. ఈనేపథ్యంలో పైలట్ ఉపవాస దీక్ష అనే కొత్త అస్త్రాన్ని వెలికితీయగా దీంతో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం పరువు పోతుందని అధిష్టానం ఆయన్ను హెచ్చరించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News