Sunday, July 7, 2024
Homeపాలిటిక్స్Rajyasabha: నెహ్రూ ఇంటిపేరు పలికే దమ్ము కాంగ్రెస్ కు ఉందా? మాపై బురదకు థ్యాంక్స్: మోడీ

Rajyasabha: నెహ్రూ ఇంటిపేరు పలికే దమ్ము కాంగ్రెస్ కు ఉందా? మాపై బురదకు థ్యాంక్స్: మోడీ

నిరంతరం నెహ్రూ నామ జపం చేసే కాంగ్రెస్ పార్టీ ఆయన ఇంటి పేరును ఎందుకు పలకదని ప్రధాని నరేంద్ర మోడీ నిలదీశారు. గాంధీ కుటుంబాన్ని ఇలా వరుస ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ మోడీ రాజ్యసభ ప్రసంగం సాగింది. తామెప్పుడైనా తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరు చెప్పటం మరిచిపోతే తమపై విరుచుకుపడే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ పూర్తి పేరును, ఇంటి పేరును ఎందుకు ఉచ్ఛరించదన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చిన మోడీ ప్రతిపక్షాలు విసురుతున్న బురదలోనే కమలం వికసిస్తుందన్నారు. ఈ దేశం ఏ ఒక్క కుటుంబం జాగీరు కాదన్న మోడీ ..ఓవైపు అదానీ కుంభకోణాలపై దర్యాప్తు జరిపించాలన్న గట్టి నినాదాల మధ్య మరింత గట్టిగా ప్రసంగించారు.

- Advertisement -

తాము రాష్ట్ర ప్రభుత్వాలను ఇరుకున పెడుతున్నామని కాంగ్రెస్ పార్టీ పదేపదే ఆరోపిస్తోందని కానీ 90సార్లు రాష్ట్ర సర్కారులను చిక్కుల్లో పడేసింది కాంగ్రెస్ పార్టీనేనంటూ మోడీ గర్జించారు. ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసేందుకు ఆర్టికల్ 356ని ఓ కాంగ్రెస్ ప్రధాని ఏకంగా 50సార్లు ఉపయోగించారని మోడీ పెద్దల సభలో గుర్తుచేశారు. ఆ ప్రధాని ఇందరా గాంధీనే అంటూ మోడీ ఘాటుగా తన ప్రసంగాన్ని రెట్టించిన దూకుడుతో కొనసాగించారు. సభలో ఆదానీ నినాదాలపై మాట్లాడిన మోడీ తమపై ఎంత బురద జల్లితే కమలం అంత బాగా వికసిస్తుందని, ఇందుకు ప్రతిపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News