Friday, April 4, 2025
Homeపాలిటిక్స్Revanth first public meeting as CM: ఇంద్రవెల్లి సెంటిమెంట్ కొనసాగించనున్న రేవంత్

Revanth first public meeting as CM: ఇంద్రవెల్లి సెంటిమెంట్ కొనసాగించనున్న రేవంత్

నేను గత సీఎంలా కాదు-తేల్చి చెప్పిన రేవంత్

సీఎం రేవంత్ రెడ్డికి ఇంద్రవెల్లి సెంటిమెంట్ గా వస్తోంది. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే ఇంద్రవెల్లిలో భారీ సభ నిర్వహించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ ను రిపీట్ చేసే ఉద్దేశంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి సభ నిర్వహించనున్నారు.

- Advertisement -

ఈమేరకు MCRHRD లో ఐదు జిల్లాల ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ నేతలతో సమావేశం అనంతరం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలంటూ సీఎం ఆయా నేతలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ నెల 26 తరువాత జిల్లాల పర్యటనకు సీఎం సిద్ధమయ్యారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి సభ ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న రేవంత్, ఇంద్రవెల్లి అమరుల స్మారక స్మృతి వనం కోసం శంఖుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ నేతలకు సూచించారు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామంటూ సీఎం స్పష్టమైన హామీ ఇచ్చారు.

అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి బాధ్యతలు ఉమ్మడి జిల్లాల ఇంచార్జి మంత్రులకు అప్పజెప్పి, సంక్షేమం, అభివృద్ధిలో అందరూ భాగస్వాములేనని భరోసా ఇచ్చారు సీఎం. తాను గత సీఎంలా కాదని తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ జనవరి 26 తరువాత ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని హామీ ఇవ్వటం హైలైట్.

వారానికి మూడు రోజులు సాయంత్రం 4 నుంచి 6 వరకు సచివాలయంలో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానన్న సీఎం రేవంత్, పార్లమెంటు ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని నేతలకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేసిన ఆయన 17 లో 12కు తగ్గకుండా ఎంపీ స్థానాలు గెలిపించుకోవాలంటూ టార్గెట్ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News