కేసీఆర్ (KCR) ని గద్దె దించాలని సిరిసిల్ల పాదయాత్రలోనే నిర్ణయించుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. బుధవారం ఆయన వేములవాడ పర్యటనలో భాగంగా గుడిచెరువులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ పై బీఆర్ఎస్ నాయకులపై విరుచుకుపడ్డారు. పదేళ్లలో 20లక్షల కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్.. 100 కోట్లతో వేములవాడ ఆలయ అభివృద్ధి ఎందుకు చేయలేదు? ప్యాకేజీ 9 ఎందుకు పూర్తి చేయలేదు? అని ప్రశ్నించారు. కేసీఆర్ పదేళ్లలో చేయలేని పనులను మేం పది నెలల్లో చేసి చూపించామన్నారు. “ఏలేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదన్నట్లు.. వాళ్లను ఓడించినా వాళ్ల తీరు మమారలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా వచ్చింది.. ఇప్పుడు వాళ్ల వేషాలు చూస్తోంటే వాళ్ల మెదడు కూడా పోయినట్టుంది” అని బీఆర్ఎస్ నేతల్ని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కి ఒక్క మాట…
పదేళ్లు ఏం వెలగబెట్టారని.. పదినెలల్లో మనల్ని దిగి పొమ్మంటున్నారు..? మీ నొప్పికి మా కార్యకర్తలకు మందు ఎక్కడ పెట్టాలో తెలుసు.. రుమాఫీపై దుష్ప్రచారం చేసున్న మీకు .. ధైర్యం ఉంటే నిజాన్ని ఎదుర్కొనే సత్తా ఉంటే అసెంబ్లీకి రా… మా వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెబుతారు. ముఖ్యమంత్రిగా నా నియోజకవర్గ ప్రజలకు నీళ్లు ఇచ్చేందుకు నారాయనపెట్ కొడంగల్ ఎత్తిపోతల పూర్తి చేద్దామంటే కాళ్లల్లో కట్టెలు పెడుతున్నరు. పరిశ్రమలు తెస్తే మా ప్రాంతానికి ఉద్యోగాలు వస్తాయని అనుకుంటే భూసేకరణ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే.. భూములు కోల్పోయి బాధలో ఉన్న వారిని మా ప్రభుత్వం అక్కున చేర్చుకుంటుంది.. పరిహారం పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేటీఆర్ ఢిల్లీ కాదు చంద్రమండలం పోయి పిర్యాదు చేసుకున్నా సరే… చేసిన కుట్రకు నువ్వు ఊచలు లెక్కబెట్టాల్సిందే… చివరగా కేసీఆర్ కు ఒక్క మాట చెబుతున్నా.. అసెంబ్లీకి రా సామి.. ఒక్కసారి రా.. అని కేసీఆర్ కి సీఎం రేవంత్ రెడ్డి చురకలంటించారు.