Saturday, April 12, 2025
Homeపాలిటిక్స్Padmarao Sec'bad BRS candidate: సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావ్

Padmarao Sec’bad BRS candidate: సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావ్

ప్రకటించిన కేసీఆర్

సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, ప్రస్థుత శాసన సభ్యుడు తిగుళ్ల పద్మారావు గౌడ్ ను బిఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ శాసన సభ్యులు ప్రజాప్రతినిధులు ఇతర ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయం సేకరించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సీనియర్ నేతగా నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా వున్న పద్మారావు గౌడ్ అందరివాడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన నిబద్ధతకలిగిన స్థానిక నేతగా ఆ ప్రాంత ప్రజలు బస్తీవాసులందరికీ పజ్జన్నగా ఆదరాభిమానాలు పొందిన పద్మారావు గౌడ్ ను సరియైన అభ్యర్థిగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.
అందరి ఏకాభిప్రాయం మేరకు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ ను బరిలోకి దింపాలని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News