రానున్న మేడారం మహా జాతరను పురస్కరించుకొని ఇసుక లారీలను నియంత్రించాలని, ఇసుక లారీల కారణంగా ప్రమాదాలు జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క సంబంధిత అధికారులు ఆదేశించారు. లారీలలో ఇసుక అధిక లోడుతో వెళ్తున్న కారణంగా జాతీయ రహదారిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. రానున్న మహా మేడారం జాతర దృశ్య ఇసుక లారీల వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.
అధిక లోడ్ తో వచ్చే ఇసుక లారీలను అనుమతించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మేడారం జాతర పనుల విషయములో అలసత్వం వహిస్తే సహించేది లేదని నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు నాణ్యతగా పనులు చేయని పక్షంలో సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెడతామని సీతక్క హెచ్చరించారు.
Seethakka: ఇసుక లారీలను కట్టడి చేయాల్సిందే
సమ్మక్క సారలమ్మ మహా జాతర నేపథ్యంలో..