Tuesday, September 17, 2024
Homeపాలిటిక్స్Shock to Errabelli: ఎర్రబెల్లికి ఎదురుదెబ్బ

Shock to Errabelli: ఎర్రబెల్లికి ఎదురుదెబ్బ

అత్తా కోడళ్ల స్కెచ్ ..

లోక్సభ ఎన్నికల ముందు ఆట మొదలెట్టిన ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి సీనియర్ లీడర్ ఎర్రబెల్లికి పదేపదే షాకులిస్తున్నారు. పాలకుర్తిలో నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే దిశగా అడుగులు వేస్తున్న అత్తాకొడళ్లు శరవేగంగా ఈ దిశగా పావులు కదుపుతున్నారు. తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన తొర్రురు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు సభ్యులు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి స్థానిక ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

- Advertisement -

పాలకుర్తి గడ్డ-కాంగ్రెస్ అడ్డా

ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం, ఇప్పటికే నాలుగు గ్యారంటీలు అమలు చేస్తున్నాం, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి, రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ గల్లంతే అంటూ ఆమె వివరిస్తుండటం విశేషం. ఎవరూ అధైర్యపడొద్దని, అందరికి అండగా ఉంటామని.. పాలకుర్తి గడ్డ-కాంగ్రెస్ అడ్డా అంటూ ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.

తొర్రూరు మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్ జీనుగా సురేందర్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు దొంగరి రేవతి, బిజ్జాల మాధవి, ముఖ్య నాయకులు దొంగరి శంకర్, బిజ్జాల అనిల్, యూత్ నాయకులు దొంగరి ఉపేందర్ లతోపాటు పలువురు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి ల సమక్షంలో పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.. కొత్తగా చేరిన వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి పనులకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ పతనం కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ కు బిఆర్ఎస్ పోటీ కాదని, కేవలం బిజెపి పార్టీనే కాంగ్రెస్ పార్టీకి పోటీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పాత కొత్త అని చూడకుండా అందరూ కలిసికట్టుగా పని చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.

కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు కల్పిస్తామన్నారు. త్వరలో జరగబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో 50 వేల మెజార్టీ వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి మాజీ సభ్యుడు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా నాయకులు హనుమాండ్ల తిరుపతిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరి ప్రసాద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, కౌన్సిలర్ భూసాని రాము, కాంగ్రెస్ నాయకులు విజయపాల్ రెడ్డి,పెదగాని సోమయ్య, ప్రసాద్ రెడ్డి, అచ్చిరెడ్డి, హనుమాండ్ల నరేందర్ రెడ్డి, బిక్షం గౌడ్, శ్రావణ్ కుమార్, వరప్రసాద్ కిషన్ యాదవ్,రాజేష్ యాదవ్, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News