Saturday, May 18, 2024
Homeపాలిటిక్స్Singanamala: పద్మావతి చేసిన అభివృద్ధి నా విజయానికి తోడ్పడుతుంది

Singanamala: పద్మావతి చేసిన అభివృద్ధి నా విజయానికి తోడ్పడుతుంది

మన ఊరికి మన వీరాలో..

గడచిన ఐదేళ్లలో ఒక పక్క సంక్షేమాన్ని, మరోపక్క అభివృద్ధిని అందించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన ఘనత ముఖ్యమంత్రి జగనన్నదేనని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు. గార్లదిన్నె మండలం కనంపల్లి, పాపినేపాళ్యం, ఎగువపల్లి, కల్లూరు గ్రామాలలో ” మన ఊరికి మన వీరా” కార్యక్రమంలో భాగంగా అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకరనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షులు పైలా నరసింహయ్య, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎగ్గుల శ్రీనివాసులు, పార్టీ శ్రేణులతో కలిసి గడపగడపకు వైయస్సార్ ఎన్నికల ప్రచారాన్ని వీరాంజనేయులు చేపట్టారు.
మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని హారతులు ఇచ్చి, పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా ప్రజలను పలకరించిన వీరాంజనేయులు జగనన్న చేసిన సంక్షేమాన్ని వివరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వీరాంజనేయులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. కుల, మత, రాజకీయాలకతీతంగా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగనన్నకు దక్కుతుందన్నారు.

- Advertisement -

2014లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. అదే బాటలో 2024లో కూడా నెరవేరని హామీలతో ప్రజలని మోసం చేయటానికి కూటములతో వస్తున్నారన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నడిపించారన్నారు. ఆమె చేసిన అభివృద్ధి నా విజయానికి తోడ్పాటు అవుతుందన్నారు. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పాలన అందించిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించాలన్నారు. నియోజకవర్గంలో ప్రజలు కరోన కష్టకాలంలో ఉన్నప్పుడు టిడిపి అభ్యర్థి కనిపించ లేదన్నారు. ఇప్పుడు ఓట్ల కోసం వస్తూ ప్రజలనుమభ్యపెడుతున్నారన్నారు. అలాంటి వ్యక్తికి ఓటు వేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటారా అని ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. కష్టం విలువ తెలిసి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ప్రజల కష్టాలు తెలుసని ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే అందరికీ సేవకుడిగా ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు

.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News