Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Srinivas Goud: మోడీ 7 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ?

Srinivas Goud: మోడీ 7 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ?

కృతజ్ఞత ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్

దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో ప్రధాని విఫలమయ్యారని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ 2014 ఎన్నికలకు ముందు మోడీ ఇచ్చిన హామీ ఏమైందని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. అందరూ బ్యాంకు ఖాతాలు తెరిస్తే విదేశాల నుంచి నల్లధనం తెచ్చి జమ చేస్తామన్న హామీ ఏమైందని అడిగారు. మహబూబ్ నగర్ కు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు, కళాశాలను తీసుకువచ్చినందుకు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదీప్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు. మెట్టుగడ్డ నుంచి ప్రారంభమైన ర్యాలీలో సుమారు పదివేల మందికిపైగా విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. దారి పొడుగునా థాంక్యూ కేసీఆర్, థాంక్యూ శీనన్న నినాదాలు చేస్తూ విద్యార్థులు బయలుదేరారు. న్యూ టౌన్ లో విద్యార్థుల ర్యాలీలో మంత్రి జత కలిశారు.

- Advertisement -

ర్యాలీ తెలంగాణ చౌరస్తాకు చేరుకున్న తర్వాత విద్యార్థులనుద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఉద్యోగాల కల్పనలో విఫలమైన బిజెపి నాయకులు కులం మతం పేరిట యువతను రెచ్చగొట్టి ఓట్లు కొల్లగొట్టేందుకు మాత్రమే కుట్రలు చేస్తారని పేర్కొన్నారు. పొరపాటున కూడా యువత వారి మాయలో పడవద్దని కోరారు. యాదాద్రి, మన్యంకొండ లాంటి అనేక దేవాలయం తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దని మంత్రి తెలిపారు. గూగుల్, ఆపిల్ లాంటి ప్రఖ్యాత కంపెనీలను తెలంగాణకు తీసుకువచ్చి రాష్ట్రం యువతకు లక్షల సంఖ్యలో ఉద్యోగాలను కల్పిస్తోందని, మహబూబ్ నగర్ ఇలాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటి కంపెనీలను తీసుకువచ్చి స్థానిక యువతకు ఉద్యోగాలను అందిస్తున్న ఘనత తమదని పేర్కొన్నారు. వచ్చేయడద నుంచి అమర్ రాజా పరిశ్రమ ద్వారా పదివేల ఉద్యోగాలను అందిస్తున్నామన్నారు.

సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో వచ్చిన జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ద్వారా స్థానికంగానే నాణ్యమైన ఉచిత ఇంజనీరింగ్ విద్యను చదివి ఇక్కడే పెద్దపెద్ద ఐటీ ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. యువత రోజుకు కోసం 20 గంటలు కష్టపడి వారు బాగుపడేలా చూస్తామన్నారు. 70 ఏళ్లలో ఒక్క ఇంజనీరింగ్ కళాశాల మెడికల్ కళాశాల కూడా తీసుకురాలేని వారు ఇప్పుడు ఎన్నికలవేళ మాయమాటలు చెప్పేందుకు ప్రజల వద్దకు వస్తున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

దేశంలోనే అత్యధిక పంట పండిస్తున్న తెలంగాణలో త్వరలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మొత్తం అయ్యేలా చేస్తామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ముఖచిత్రం మారుస్తామని అత్యధిక పరిశ్రమలను తీసుకువచ్చి స్థానికంగానే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద అర్బన్ ఎకో ఫారెస్ట్ మన దగ్గరే ఉండడం గర్వకారణం అన్నారు. మన్యంకొండ రోప్ వే, శిల్పారామం, జంగిల్ సఫారీ మహబూబ్ నగర్ కు మణిహారంగా నిలుస్తున్నాయన్నారు.

అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ చిత్రపటానికి విద్యార్థులు పాలాభిషేకం చేశారు. జేఎన్టీయూ కళాశాల వచ్చిందన్న సంబరంతో విద్యార్థులు నృత్యం చేశారు. విద్యార్థుల కోరిక మేరకు వారితో కలిసి కొద్దిసేపు మంత్రి స్టెప్పులేశారు. జై తెలంగాణ జై కేసీఆర్ జై శీనన్న నినాదాలతో తెలంగాణ చౌరస్తా మార్మోగిపోయింది. న్యూటౌన్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ఇసుకేస్తే రాలనంతగా విద్యార్థులు తరలివచ్చారు. బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదీప్ రెడ్డి, విద్యార్థి నాయకులు శివ, నాని, సత్యపాల్, మనీష్ గౌడ్, పవన్, గణేష్, శ్రీకాంత్, వినయ్, సాయి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News