Tuesday, November 5, 2024
HomeతెలంగాణSrinivas Goud: దివ్యాంగులకు 4,016 పింఛన్ ఇస్తున్నది మేమే

Srinivas Goud: దివ్యాంగులకు 4,016 పింఛన్ ఇస్తున్నది మేమే

మేం మీకు అండగా ఉంటామన్న మంత్రి

దివ్యాంగులకు తమ ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో… మినిస్టర్ క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో అర్హులైన పది మంది దివ్యాంగులకు చేతుల మీదుగా పది 3 చక్రాల స్కూటీలను అందజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ. 4016 పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో దివ్యాంగుల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకువస్తామని తెలిపారు.

కార్యక్రమంలో ముడా చైర్మన్ గంజి వెంకన్న, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, జిల్లా గొర్రె కాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శాంతన్న యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, జిల్లా సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News