గొప్ప పరిపాలనాదక్షుడైన రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో పుట్టడం జిల్లా వాసులకు గర్వకారణమని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కొత్వాల్ రాజ బహదూర్ వెంకట రామారెడ్డి 154వ జయంతి సందర్బంగా ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద రాజా బహద్దూర్ వెంకటరామి రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఆయన మన జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారని, రెడ్డి హాస్టల్ ద్వారా అనేక మందిని ప్రయోజకులను చేసిన ఘనత ఆయనదని, ఎంతో మంది పేదలకు అయన హాస్టళ్లలో ఆశ్రయం కల్పించి ప్రయోజకులను చేశారన్నారు.
ఆయనను ఆదర్శంగా తీసుకొని అనేక సామాజిక వర్గాలకు చెందినవారు హాస్టళ్లు ఏర్పాటు చేసి, పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారన్నారు. పోలీస్ అకాడమీకి ఆ మహనీయుని పేరు పెట్టి గౌరవించుకుంటున్నామని, కొత్వాల్ జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి స్వగ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, ఆ మహానుభావుడి ఇంటిని మ్యూజియంలా మారుస్తామని తెలిపారు.
మహబూబ్ నగర్ పద్మావతి కాలనీ గ్రీన్ బెల్టు వద్ద మహనీయుల విగ్రహాలు ఉన్న ప్రాంతాన్ని 2.50 కోట్లతో సుందరీకరిస్తామని, గ్రీన్ బెల్టు వద్ద వేమన విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని, సురవరం ప్రతాపరెడ్డి, చాకలి ఐలమ్మ, పాపన్న, దొడ్డి కొమరయ్య, పండుగ సాయన్న లాంటి మహనీయులు మనకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
కార్యక్రమంలో ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కే.సి నర్సింహులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, రైతుబంధు సమితి డైరెక్టర్ మల్లు నర్సింహారెడ్డి, కౌన్సిలర్ కట్టా రవికిషన్ రెడ్డి, రెడ్డి సంఘం నాయకులు ఇంద్రసేనా రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, రాఘవ రెడ్డి, రాజేందర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి తదితరులు ఉన్నారు.