Tuesday, February 27, 2024
Homeపాలిటిక్స్Tandur: పైలెట్ ఓటమి, మనోహర్ రెడ్డి విజయం

Tandur: పైలెట్ ఓటమి, మనోహర్ రెడ్డి విజయం

6899 ఓట్లతో మెజారిటీతో ..

తాండూరులో కాంగ్రెస్ జెండా ఎగిరింది..  లోకల్ బిడ్డ పైలెట్ రోహిత్ రెడ్డి ఓటమిపాలయ్యాడు. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి 6,899 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తాండూరు గడ్డ కాంగ్రెస్ కంచుకోటగా గుర్తు చేశారు. కాంగ్రెస్ గెలుపు సందర్భంగా తాండూరు నియోజకవర్గం వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, టపాసులు కాలుస్తూ మిఠాయిలు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని రాజీవ్, ఇందిరమ్మ కాలనిలో కాంగ్రెస్ విజయం సాధించిన సందర్భంగా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… అతితక్కువ సమయంలో మనోహర్ రెడ్డి గెలుపొందడం సంతోషం అన్నారు. తాండూరులో కాంగ్రెస్ గెలుపుకు కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News