నా భర్తను భారీ మెజారిటీతో గెలిపించండి అని బిఆర్ఎస్ తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి కోరారు. తాండూరు పట్టణంలోని 3, 4వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక కౌన్సిలర్, ప్రజాప్రతినిధిలు, నాయకులతో కలిసి గడప గడపకు వెళ్లి బీఆర్ఎస్ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆర్తి రెడ్డి మాట్లాడుతూ… వ్యారెంటి, గ్యారెంటీ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ.. అడ్రస్సు లేని పథకాల పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ఆరు గ్యారెంటీల కాంగ్రెస్, బిజెపి పార్టీలు చేసె మోసపూరితమైన మాటలను నమ్మి మోసపోవద్దని, బిఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని తెలిపారు.
మీ ఆశీర్వాదంతో నా భర్తకు మరోసారి అవకాశం ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించుకొని తాండూరు అభివృద్ధిలో భాగస్వాములు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్పర్సన్ దీపా నర్సింలు, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వీణ శ్రీనివాస్ చారి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభ రాణి, పట్టణ మహిళా అధ్యక్షురాలు సంగీత ఠాగూర్, కౌన్సిలర్ అస్లం, మాజీ కౌన్సిలర్ సిహెచ్ అనురాధ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఖాసిం, మాజీ ఉర్దూగర్ చైర్మన్ సలీం, ప్రచార కార్యదర్శి సాగర్ గౌడ్, వార్డు ఇన్చార్జ్ అక్రమ్, సోషల్ మీడియా కన్వీనర్ రమేష్ టైలర్, యువ నాయకులు అనంత్ రెడ్డి, వెంకట్ సుబ్బు, బోయ నరేష్, మల్లేష్ యాదవ్, మహిళా నాయకులు అనిత రమేష్, నిర్మల వార్డు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.