తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడా లేని హై టెన్షన్ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నెలకొంది. తాండూరు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వర్సెస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి లొల్లి అందరికి తెలిసిందే. ఇదిలావుండగా తాజాగా ఇప్పడు టికెట్ రేసులో మూడవ వ్యక్తి రావడంతో మరింత టెన్షన్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఆ మూడవ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారుడు, రాష్ట్ర బిసి కమిషన్ సబ్యులు ఎన్. శుభప్రద్ పటేల్ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తక్కువ సమయంలో లొనే ప్రజలకు దగ్గరై సేవ కార్యక్రమాలు చేస్తూ శుభప్రద్ పటేల్ ట్రస్ట్ ద్వారా తాండూరు ప్రజలకు మరింత చేరువై ఎవరికి ఏ సమస్య ఉన్న వెంటనే ట్రస్ట్ సబ్యుల ద్వారా వారి సమస్యలను పరిష్కరిస్తూ తాండూరు ప్రజల దగ్గర మంచి ఆదరణ ఆయనకు లభించింది అని చెప్పుకొస్తున్నారు. ఇటీవల శుభప్రద్ పటేల్ జన్మదిన సందర్భంగా తాండూరులో వారి అభిమానులు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పట్టణంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు… అయితే అసలు చిక్కు ఇక్కడే మొదలైంది. జన్మదిన వేడుకలో శుభప్రద్ పటేల్ ప్రసంగిస్తూ… తాండూరు రాజకీయాలను ఉదేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా కొన్ని సందర్భాల్లో శుభప్రద్ పటేల్ ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం ఇస్తే నేను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్ కోసం పైలెట్ రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి పాకులాడే విషయం అందరికి తెలిసిందే. ఇంతలో మరొక వ్యక్తి రావడంతో తాండూరు రాజకీయాల్లో తికమకలు మొదలయ్యాయి. ఎవరికి వారు టికెట్ తమకే వస్తుందని ధీమా లో ఉన్నారు. తాండూరు నియోజకవర్గం ప్రజలు మాత్రం ఎవరికి ఆశీర్వదిస్తారో వేచి చూడాల్సిందే.
Tandur: కారులో ఎమ్మెల్యే టికెట్ ‘లొల్లి’
తాండూరు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ?