Sunday, July 7, 2024
Homeపాలిటిక్స్Tellapur: కొల్లూరులో డబుల్ బెడ్ రూంల పంపిణీ

Tellapur: కొల్లూరులో డబుల్ బెడ్ రూంల పంపిణీ

తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం విజయం సాధించారు

తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో రెండో విడత డబుల్ బెడ్ రూంల పంపిణీ. లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేశారు రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు గారు మాట్లాడుతూ.. GHMC పరిధిలోని 9 నియోజకవర్గాలు కుత్బుల్లాపూర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, పటాన్ చెరు, మేడ్చల్, ఉప్పల్ నియోజకవర్గాల పరిధిలో నేడు ఇండ్ల పంపిణీ జరుగుతోందన్నారు.

- Advertisement -

“పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు 2లో 4800 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ. నియోజకవర్గానికి 500 ఇండ్ల చొప్పున కేటాయింపు. కెసిఆర్ నాయకత్వంలో పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు జరుగుతుంది ఎవరికి ఏ బ్లాక్ లో ఇల్లు వచ్చిందనేది కంప్యూటర్ ద్వారా కేటాయింపు జరుగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇచ్చే రూ.60 వేలకు లంచాలు అడిగేవారు. ఇళ్ళ కాగితాలు కూడా బ్యాంకు లో జప్తు పెట్టేటోళ్ళు కెసిఆర్ సర్కార్ లో ఆ మాటే లేదు. అందుకే కెసిఆర్ ఆడవారి పేరుపై ఇండ్లు ఇస్తున్నారు”.

“ముఖ్యమంత్రి జనాలకు కిట్లు ఇస్తుంటే… కాంగ్రెస్, బీజేపీ తిట్లు ఇస్తున్నారు. 60 యేండ్లలో కాంగ్రెస్, టీడీపీ చేయని పనులు 10 ఏళ్ళ లో BRS సర్కారు చేసింది. ఇక్కడ ప్రభుత్వ పాఠశాల, బస్తి దవాఖాన, రేషన్ షాప్ ఏర్పాటు చేస్తాం. రజినీకాంత్ హైదరాబాద్ వచ్చి… అమెరికా లో ఉన్నానా అన్నారు. రజినికి అర్థమైన అభివృద్ధి.. ఇక్కడున్న కాంగ్రెస్, బీజేపీ గజినీ లకు అర్థమైతలేదు. ప్రజలే BRS హైకమాండ్, ఒక్కొక్కరు ఒక్కో కెసిఆర్ కావాలి”.


“కెసిఆర్ ఏం అభివృద్ధి చేసాడో మీరే మీ గల్లీలో చెప్పాలి. హైదరాబాద్ లో లక్ష ఇండ్లు ఇస్తున్నాం.
150 ఎకరాల్లో 16700 ఇండ్లు కొల్లూరులో ఇస్తున్నాం. సుప్రీం కోర్టులో పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ పై వేసిన కేసులో ఆంధ్రప్రదేశ్ ఓడింది. తెలంగాణ ప్రభుత్వం గెలించింది. ఆలస్యం కావచ్చు న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. పాలమూరు ఎత్తిపోతల పథకంపై అక్రమంగా ఏపీ వేసిన కేసు కొట్టుకుపోయింది. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. 90 TMC నీళ్ళు కృష్ణా నదీ జలాల్లో మనకు వాటా దక్కుతుంది. పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతి తెచ్చుకుంటాం. కృష్ణా నది జలాలను బాజప్తా ఎత్తిపోసుకొని పాలమూరు రిజర్వాయర్లు నింపుకుంటాం. దొంగ డిక్లరేషన్ చేసిన వారికి బుద్ది చెప్పేలా మూడో సారి కెసిఆర్ ను సీఎం చేయాలి” అంటూ హరీష్ రావ్ ప్రసంగం సాగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News