Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Thalakondapalli: మందా జగన్నాథం బీఎస్పీలోకి

Thalakondapalli: మందా జగన్నాథం బీఎస్పీలోకి

మాయావతి సమక్షంలో..

బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి బహెన్జీ మాయావతి సమక్షంలో నాగర్ కర్నూల్ మాజీ పార్లమెంట్ సభ్యుడు సీనియర్ రాజకీయ నాయకుడు మంద డాక్టర్ మంద జగన్నాథం బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి మంద జగనాథాన్ని కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజస్థాన్లోని కల్వర్ నందు బీఎస్పీ అధినేత్రి మాయావతి సమక్షంలో బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ ఆధ్వర్యంలో బి.ఎస్.పి పార్టీలో మాజీ ఎంపీ డాక్టర్ మంద జగనాథం చేరారు.

- Advertisement -

ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కోసం బీఎస్పీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుందని, ఇందులో భాగ్యస్వామ్యం అయినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికైన విధంగానే ఈసారి కూడా బహుజనుల సహకారంతో ఎన్నిక కావాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ శ్రీ రాంజీ గౌతం బిఎస్పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ పాల్గొన్నారు.

కాంగ్రెస్ లోకి ఎందుకెళ్లనట్టు?

నిజానికి మందా జగన్నాథాన్ని కాంగ్రెస్ లోకి రావాల్సిందిగా సీఎం రేవంత్ తో సహా ఎంతోమంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆహ్వానించారు. ఒక దశలో ఆయన కాంగ్రెస్ లో చేరటం ఖాయమని ప్రచారం జోరుగా సాగింది. ఇప్పటికే పలు పార్టీలు మారిన మందా ఆ మధ్య సైలెంట్ అయ్యారు. హార్ట్ ట్రీట్మెంట్ అయ్యాక ఆయన టీవీ చానెళ్లలో డిబేట్లు కూడా చాలావరకు తగ్గించారు. పాలిటిక్స్ లో చాలా చురుకైన పాత్ర పోషిస్తూ, ఎప్పుడూ మీడియాలో కనిపించే మందా ఎందుకు ఇంత సైలెంట్ అయ్యారు, అసలు కాంగ్రెస్ లో ఎందుకు చేరలేదని ఆయన అభిమానులు చర్చించుకుంటుండటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News