Saturday, May 18, 2024
Homeపాలిటిక్స్Thimmapur: నువ్వెంతున్నవ్ బిడ్డ?

Thimmapur: నువ్వెంతున్నవ్ బిడ్డ?

మాజీ ఎమ్మెల్యే రసమయిని..

కరీంనగర్ ముద్దుబిడ్డ, మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంతున్నడు అని అడిగేముందు నువ్వెంతున్నవో చూసుకోవాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను కాంగ్రెస్ మానకొండూర్ నియోజకవర్గ శ్రేణులు ఘాటుగా విమర్శించాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఎస్సీసెల్ నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి ఎల్కపెల్లి సంపత్, ఇల్లంతకుంట మండల మాజీ అధ్యక్షుడు పసుల వెంకటి మాట్లాడుతూ, బెజ్జంకిలో జరిగిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే రసమయిపై సీరియస్ అయ్యారు. ఆయన ఎత్తు గురించి మాట్లాడే ముందు తన ఎత్తు ఎంతుందో చూసుకోవాలని సూచించారు. ఎంపీగా, ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా, మార్క్ ఫెడ్ చైర్మన్ గా ఎన్నో ఉన్నత పదవులు అనుభవించిన ఆయనను విమర్శించే రసమయి బాలకిషన్.. దొరల గడిల కేసీఆర్ వేసిన బొక్కలు తిని పదవులు పొందినట్టు అనుకున్నవా? అని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రజలు నిన్ను మెదక్ తరిమికొట్టారనీ, నువ్వు వెంట తిరిగే అభ్యర్థిని సైతం వరంగల్ కు తరిమే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్, ఎస్సీసెల్ మండలాధ్యక్షుడు రెడ్డిగాని రాజు, సీనియర్ నాయకుడు ఆలువాల కోటి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News