Friday, April 4, 2025
HomeతెలంగాణTPCC Chief | కేటీఆర్ 'బేకార్' వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ కౌంటర్

TPCC Chief | కేటీఆర్ ‘బేకార్’ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ కౌంటర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ధీటుగా స్పందించారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. సీఎం రేవంత్ టీం మార్క్ పాలన అంటే ఏంటో చూపిస్తామన్నారు. కేసీఆర్ లా అనవసర వాగ్ధానాలు ఇచ్చి జారవిడిచే అలవాటు మాకు లేదని టీపీసీసీ చీఫ్ (TPCC Chief) అన్నారు.

- Advertisement -

కాగా, ఇటీవల కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం 12 మంది బేకార్ గాళ్ళతో నడుస్తోందంటూ ఘాటు విమర్శలు చేశారు. పైసలు ఎన్ని ఉన్నాయి, స్కీములు ఎలా అమలు చేయాలి అనేది ఒక్కరికి కూడా తెలియదని ఎద్దేవా చేశారు. రైతుబంధు, పెన్షన్లు, తులం బంగారం, 6 గ్యారంటీలు ఎగ్గొట్టుడు… రుణమాఫీ సగమే చేసి మొత్తం చేశామని డబ్బా కొట్టుకోవడమే కాంగ్రెస్ నాయకులకు తెలుసంటూ విమర్శించారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News