బీఆర్ఎస్ ఉనికి కష్టమే, పైగా పార్లమెంట్ ఎన్నికల్లో సీన్ అంతా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనే అంటూ వెల్లడించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేటీఆర్ భ్రమల్లో బ్రతకటం మానేసి, వాస్తవంలోకి రావాలంటూ హూంకరించిన ఉత్తమ్, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 13 సీట్లు రావటం ఖాయమని విశ్వాసం వ్యక్తంచేశారు. అసలు కేసీఆర్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలి అనేది కూడా చర్చలో ఉండదని ఆయన అనటం విశేషం.
మేడిగడ్డ పై విజిలెన్స్ నివేదిక అసెంబ్లీ సమావేశాల నాటికి వస్తుందన్న నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మేడిగడ్డపై ప్రాథమిక విచారణ నివేదిక తనకు ఇంకా అందలేదని వెల్లడించారు. త్వరలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని, తేదీలు కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు.