వెల్దుర్తిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించిన KE శ్యాం బాబు. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకుడు సుబ్బరాయుడు మండల అధ్యక్షుడు బలరాం గౌడ్ టిడిపి సీనియర్ నాయకులు LE జ్ఞానేశ్వర్ గౌడ్ జయరాముడు సుధాకర్ గౌడ్ పాల్గొని, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేశారు.
వారు మాట్లాడుతూ రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రం వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనం అయిందని తెలుగుదేశం ప్రారంభించిన పథకాలు వైసీపీ ప్రభుత్వం ప్రారంభం చేస్తోందన్నారు. ప్రజలు తెలుగుదేశం వైపు చూస్తున్నారన్నారు. వచ్చేది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వమేనని, నారా చంద్రబాబు నాయుడు ఆరు పథకాలు ప్రవేశ పెడుతున్నారన్నారు. ఈ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని వారు అన్నారు. వైసిపి ప్రభుత్వం ఇసుక మైనింగ్ మాఫియాకు పాల్పడుతోందని, గ్రామాల్లో ఒక తాగునీటి పైప్ లైన్ తప్ప వేరే అభివృద్ధి పనులు చేయలేదని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించి పేద బడుగు బడుగుల వారికి మేలు చేస్తుందన్నారు. వైసీపీ పాలన అంతం కావడానికి దగ్గర పడిందని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గపు రైతు సంఘం నాయకులు వెంకట్ రాముడు క్రిష్ణగిరి నాయకులు వెల్దుర్తి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.