Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Vemula Prashanth: కేసిఆర్ ది జనరంజక పాలన

Vemula Prashanth: కేసిఆర్ ది జనరంజక పాలన

మంచి చేసే వారిని ఆదరించి, మాటలు చెప్పేవారికి బుద్ది చెప్పాలి

కేసిఆర్ జనరంజక పాలన,బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అబివృద్దికి ఆకర్షితులై బీజేపీ,కాంగ్రెస్ ల నుంచి పలువురు యూత్ సభ్యులు సుమారు 100 మంది రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో యాల్ల మహిపాల్ అధ్వర్యంలో కాంగ్రెస్ నుండి శేఖర్, మహేష్, వంశీ పలువురు యువకులు, బీజేపీ నుండి విష్ణు, పవన్, శ్రీకాంత్ పలువురు యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పడిగల్ సర్పంచ్ రాజ్ కుమార్, ఎంపిటిసి శ్యామ్ రావు, పిఏసిఎస్ చైర్మన్ హన్మంతు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

మెండోర మండలం సావెల్ గ్రామం నుంచి ఎంపిటిసి రాజేశ్వర్ అధ్వర్యంలో ఎస్టీ సంఘం లీడర్ సంతకాల తిరుపతి, ఢీ3 యూత్ సభ్యులు,పెర్ఫెక్ట్ యూత్ సభ్యులు,ఆర్ ఆర్ యూత్ సభ్యులు సుమారు 60 మంది యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ…

రాష్ట్రంలో కేసిఆర్ జనరంజక పాలన,బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది చూసి కేసిఆర్ కు తనకు మద్దతుగా నిలవాలని నిర్ణయించుకొని భారత రాష్ట్ర సమితిలో చేరిన వివిధ పార్టీల వారికి, యువతకు పార్టీలోకి సాదర స్వాగతం పలుకుతున్న అని అన్నారు. ఇక నుండి మీరు నా కుటుంబ సభ్యులనీ అన్ని సందర్భాల్లో మీకు తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. మీరు పార్టీలో చేరి మీ గ్రామాల్లో అభివృద్ధి చేసేందుకు తనకు మద్దతునిచ్చి మరింత బలాన్ని పెంచారని అన్నారు. ఎవరెన్ని మాటలు చెప్పిన బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని, అన్ని వర్గాల ప్రజల అభివృద్దే ధ్యేయంగా కేసిఆర్ సర్కార్ పనిచేస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు. మంచి చేసే వారిని ఆదరించి..మాటలు చెప్పేవారికి బుద్ది చెప్పాలని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. కేసిఆర్ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్దిపై ప్రజలే ఆలోచన చేయాలనీ కోరారు. పార్టీ శ్రేణులు తమ తమ గ్రామాల్లో కేసిఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్దిపై చర్చించాలని, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనీ మంత్రి ఈ సందర్బంగా సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News