Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Medak: నెల రోజుల్లో 100 కోట్ల ట్రస్టు

Medak: నెల రోజుల్లో 100 కోట్ల ట్రస్టు

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నినాదం ఇదే

మెదక్ కలెక్టరేట్ లో మెదక్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు పి వెంకటరామరెడ్డి. ప్రజా సేవకోసమే రాజకీయాల్లోకి వొస్తున్నా.. కొనాయపల్లి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణంగా చెబుతున్నా గెలిచిన నెల రోజుల్లో 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేస్తానని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి తెలిపారు..

- Advertisement -

బీఆర్ఎస్ సెంటిమెంట్ ఆలయం నంగునూరు మండలంలోని కొనాయపల్లి శ్రీ వెంకటేశ్వరాలయంలో స్వామి వారి వద్ద నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ..మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీశ్ రావులతో పాటు మెదక్ పార్లమెంటు ప్రజల ఆశీస్సులతో ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచినట్టు తెలిపారు. కలెక్టర్ గా ఖ్యాతి ఇచ్చిన ఈ గడ్డ నాకు రాజకీయ జీవితం ఇవ్వాలని కోరారు. మాట తప్పే మనిషిని కాదని, స్వామి వారి సాక్షిగా ట్రస్టు ఏర్పాటు చేసి యువతీ యువకులకు అండగా నిలుస్తామన్నారు. స్వామి వారి ఆశీస్సులతో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News