పార్లమెంట్ టికెట్ తనకు ఇచ్చే అవకాశం లేదని అలకబూనిన వి హెచ్ గత కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల మీడియా ముందు అసంతృత్తి వ్యక్తం చేసిన విహెచ్ సంగతి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. ఇవాళ హనుమంత్ రావును వెంట తీసుకెళ్లి సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డితో కలిపించారు మహేష్ కుమార్ గౌడ్. సీఎంని కలిసిన విహెచ్ కు తాను అన్ని విధాలా అండగా ఉండనున్నట్లు సీఎం చెప్పారు. నాయకులందరినీ కలువుకుని వెళ్లాలన్న ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఈమేరకు వీహెచ్ తో భేటీ అవటం విశేషం.
VH met CM Revanth: సీఎం రేవంత్ తో వీహెచ్ భేటీ
వీహెచ్ ను బుజ్జగించిన రేవంత్