విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలంటూ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. మిషన్ 2024 పేరుతో అన్ని ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా పోరాడితేనే బీజేపీని ఇంటికి సాగనంపచ్చని ఆమె ఉద్బోదించారు. బీజేపీది అంతా ‘వాషింగ్ మెషీన్ థియరీ’ అంటూ ఓ నల్ల గుడ్డను వాషింగ్ మెషీన్ లోకి వేసి తెల్ల గుడ్డను బయటికి తీసి మరీ చెప్పారు దీదీ . తలపొగురుతో మిడిసిపడుతున్న బీజేపీని ఓటమిపాలు చేసి, దుశ్సాసనుడి నుంచి దేశాన్ని కాపాడాలని, దుర్యోధనుడిని ఓడించి ప్రజాస్వామ్యాన్ని, పేదలను కాపాడాలన్నారు. కాగా మొన్నటి వరకు తాను ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు పదేపదే ప్రకటించిన మమతా, పశ్చిమ బెంగాల్ స్థానిక ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల దీక్షను చేపట్టారు.
బెంగాల్ పై, తృణముల్ పై బీజేపీ కక్ష కట్టిందని, అందుకే తమకు ఏ అభివృద్ధి పథకాలకూ కేంద్రం నిధులు మంజూరు చేయటం లేదని ఆమె మండిపడ్డారు.