రామగుండం నియోజవర్గంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా చందర్ గెలుపు కోసం తామంతా ఉన్నామని దళిత బంధు లబ్ధిదారులు పేర్కొన్నారు. ఈ మేరకు దళిత బంధు లబ్ధిదారుల సమావేశం తిలక్ నగర్ విశ్వం ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ నాయకులు నీరటి శ్రీనివాస్ మాట్లాడారు. రామగుండం నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా బిఆర్ఎస్ పార్టీ. నాయకులు కందుల సంధ్యారాణి, మాజీ మేయర్ కొంకటి లక్ష్మి నారాయణ, పాతిపెళ్లి ఎల్లయ్య, లక్ష్మి, టిబిజికేఎస్ నేత మిర్యాల రాజిరెడ్డి, బయ్యపు మనోహరి రెడ్డి పార్టీకి నష్టం కల్గించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే చందర్ కు పార్టీకి ఇబ్బంది కల్గించే
కార్యక్రమాలకు పాల్పడుతున్నారనీ విమర్శించారు. ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలని ఎన్ని సార్లు ఎమ్మెల్యే చెప్పినప్పటికి ఇదే విధానాన్ని కొనసాగిస్తు పార్టీని చులకన చేస్తున్నారనీ ఆరోపించారు. ఇలాంటి చర్యల వలన ప్రత్యక్షంగా పరోక్షంగా బిజెపి, కాంగ్రెస్ కు మేలు చేసే విధంగా వీరి ప్రవర్తన ఉన్న దృష్ట్యా బిఆర్ఎస్ అధిష్టానానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు వీరిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసిందిగా
దళిత బందు లబ్ధిదారులందరు కలిసి కోరుతున్నట్లు పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో సుమారు
45 వేల మంది దళిత సంఘాలు మరియు దళిత కుటుంబాలు తమ మద్దతును ప్రకటిస్తున్న సమయంలో ఏదో విధంగా ఎమ్మెల్యే చందర్ ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం వారిలో కనిపిస్తుందని అన్నారు. రానున్న రోజులలో ఎమ్మెల్యే గా చందర్ గెలుపు కోసం కృషిచేస్తామన్నారు. ఈ సమావేశంలో బి అర్ ఎస్ పార్టీ సమన్వయ కమిటీ నాయకులు నీరటి శ్రీనివాస్, జడ్సన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Ramagundam: ఎమ్మెల్యే గా చందర్ గెలుపు కోసం మేమున్నాం
దళితబంధు లబ్దిదారుల మద్దతు