Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Padi Kaushik: పార్టీ మారిన ఎమ్మెల్యేల లొసుగులన్నీ బయటపెడతాం

Padi Kaushik: పార్టీ మారిన ఎమ్మెల్యేల లొసుగులన్నీ బయటపెడతాం

పార్టీ ఎమ్మెల్యేలను వదిలేదే లేదు

రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే పింఛన్లు రెండు వేల నుండి నాలుగు వేల రూపాయలకు పెంచుతామని చెప్పారని, వికలాంగులకు నాలుగు వేల నుండి ఆరు వేలకు పెంచుతామని అన్నారని, సీఎం అయ్యాక
రేవంత్ రెడ్డి పింఛన్ల గురించి మర్చిపోయారని భగ్గుమన్నారు బీఆర్ఎస్ నేతలు.

- Advertisement -

ఇంట్లో అవ్వ,తాతకు పింఛన్ ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని, మూడు నెలల పింఛన్లను రేవంత్ రెడ్డి ఆపారని, పింఛన్లపై ఆధారపడిన అవ్వా, తాతలకు పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి. పింఛన్లపై రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తున్నట్టు చెప్పిన కౌశిక్ రెడ్డి, 2004 నుండి 2014 వరకు పింఛన్ కేవలం 200 రూపాయలు మాత్రమేనని, కేసీఆర్ సీఎం అయ్యాక
2014 నుండి పింఛన్లను రెండు వేల రూపాయలకు పెంచారన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక
44 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారని, 59 వేల కోట్లు పింఛన్లకు కేసీఆర్ కేటాయించారని వివరించారు.

తెలంగాణ ప్రజలపై కేసీఆర్ కున్న ప్రేమ రేవంత్ రెడ్డికి లేదని, వంద రోజుల్లో పింఛన్లు పెంచుతామని చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు మాట తప్పారని, మేము ప్రశ్నిస్తే మాపై ఎదురుదాడి చేస్తున్నారని భగ్గుమన్నారు. కుటుంబానికి ఇద్దరికి పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నేతలు, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వున్న నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు.

కళ్యాణలక్ష్మి చెక్కులను మాకు తెలియకుండా పంపిణీ చేస్తున్నారని, హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మార్వోలకు స్వయంగా లెటర్ రాసినా మంత్రి రావాలని చెక్కులను ఆపుతున్నారని ఆరోపించారు. మా హుజురాబాద్ ప్రజలను ఇబ్బంది పెడితే తాట తీస్తామని, 27 వ తేదీతో కళ్యాణలక్ష్మి చెక్కుల కాలపరిమితి ముగుస్తుంది. కళ్యాణాలక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని మేము అడుగుతామని భయపడుతున్నారా? అంటూ కౌశిక్ రెడ్డి నిలదీశారు.

అధికారం ఎవరికి శాశ్వతం కాదని, అధికారుల కోసం బ్లాక్ బుక్ రెడీ చేశానని, బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అధికారులకు బ్లాక్ డేస్ వుంటాయన్నారు. చెక్కులను ఎమ్మెల్యేకు ఇవ్వవద్దని మంత్రి ఎమ్మార్వోలకు ఆదేశాలు ఇస్తున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వున్న చోట వారే కళ్యాణలక్ష్మి చెక్కులను ఇస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది, అధికారులు ప్రోటోకాల్ ప్రకారం చెక్కులు పంచకపోతే
హై కోర్టుకు వెళ్తానని, హుజురాబాద్ ఎమ్మెల్యేకు చెక్కులు ఇవ్వవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్డీవో,ఎమ్మార్వోలకు చెప్తున్నారని ఆరోపించారు.

ఫ్లై యాష్ రవాణాలో నాకు పొన్నం ప్రభాకర్ లీగల్ నోటీసులు పంపించారని, మీ లీగల్ నోటీసులకు
మా లీగల్ టీమ్ లీగల్ గా సమాధానం చెప్తుందన్నారు. అధిక లోడ్ తో లారీలు నడిపవచ్చా? రవాణా మంత్రిగా పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పాలన్నారు. పొన్నం ప్రభాకర్ ప్రమేయం లేకపోతే ఓవర్ లోడ్ లారీలపై చర్యలు ఎందుకు తీసుకొవడం లేదని, ఫ్లై యాష్ రవాణాలో పొన్నం ప్రభాకర్ డబ్బులు తీసుకోకపోతే బుధవారం టీటీడీ వెంకటేశ్వరస్వామి టెంపుల్ లో ప్రమాణానికి సిద్దమా? అంటూ సవాలు విసిరారు. బుధవారం రోజు పొన్నం ప్రభాకర్ రాకపోతే మరిన్ని నిజాలు బయటపెడతామని, బిఆర్ఎస్ పార్టీకి 34 మంది ఎమ్మెల్యేలు,28 మంది ఎమ్మెల్సీలు,4 రాజ్యసభ సభ్యులు వున్నారన్నారని, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారితే బిఆర్ఎస్ కు వచ్చే నష్టం లేదని అన్నారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎవరిని విడిచిపెట్టమని, మీ లొసుగులన్ని బయటపెడతామని హెచ్చరించటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News