Sunday, December 8, 2024
Homeనేరాలు-ఘోరాలుKarimnagar: భూఖబ్జాదారుల నుండి ప్రభుత్వ భూమి కాపాడండి

Karimnagar: భూఖబ్జాదారుల నుండి ప్రభుత్వ భూమి కాపాడండి

ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలు, చూస్తూ ఊరుకోవాలా?

అధికారులు ప్రజలకు జవాబుదారుతనంగా పనిచేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా తమను ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలకు అధికారులు పాల్పడుతుండడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటుంది. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి వాటిని రక్షించండి అని ఒక సగటు వ్యక్తి అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారు స్పందించకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా మా పైనే ఫిర్యాదులు చేస్తావా అంటూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న తీరు చూస్తుంటే అధికారులు ఏ స్థాయిలో తమ అధికార దుర్విని పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -

తనకు వారసత్వంగా సంక్రమిస్తున్న భూమిని తన పేరు మీద విరాసత్ చేయాలని కోరగా అందుకు సవాలక్ష కారణాలు చెబుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం చూస్తుంటే అధికారులు ఎంతకు తెగిస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. ఇది ఎక్కడో మారుమూల మండల కేంద్రంలో జరుగుతుంది అనుకుంటే పొరపడినట్లే. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కొత్తపల్లి మండల కేంద్రంలో ఒక వ్యక్తిపై సంబంధిత అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న ఉన్నత అధికారులు స్పందించకపోవడం విస్మయాన్ని కలిగిస్తుంది.

బాధితుడు తెలిపిన వివరాలు ప్రకారం… కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామానికి చెందిన దుర్గం మనోహర్ 2018 సంవత్సరంలో రేకుర్తి గ్రామంలోని సర్వే నంబర్ 55, 137 నద్దినాల ప్రభుత్వ భూములు కాపాడాలని సంబంధిత రెవెన్యూ అధికారులకు, ఎమ్మార్వో, ఆర్డీవో డిఆర్ఓ, అదనపు కలెక్టర్, సిసిఎల్ఏ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కరీంనగర్ ఆర్డీవో, కొత్తపల్లి మాజీ తాసిల్దార్ చిల్లా శ్రీనివాస్ నువ్వు మాపై పై అధికారులకు ఫిర్యాదు చేస్తావా అంటూ తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.

తన తండ్రిగారైన మల్లయ్య కొత్తపల్లి హవేలీ గ్రామం హవేలీలోని సర్వే నంబర్ 432 లో రెండు ఎకరాల 16 గుంటల భూమిని 30 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసినట్లు చెప్పారు. సదరు భూమి కొనుగోలు చేసిన తర్వాత తన తండ్రి బండ కిషన్ రెడ్డి కి నాలుగున్నర గుంటలు విక్రయించగా బండ కిషన్ రెడ్డి ఖాతా నెంబర్ 96. నాలుగున్నర గుంటల భూమిని మోటేషన్ చేసి ఖాతా నెంబర్ సైతం మంజూరయిందన్నారు. ఈ క్రమంలో తన తండ్రి 2020 ఆగస్టు 13న మృతి చెందడంతో తన తల్లి పేరు మీద 29జూలై 2022 న వీరాసత్ చేయించినట్లు చెప్పారు. తన తల్లి నుండి తనకు రావలసిన వాటా 21 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు ధరణి పోర్టల్ లో అన్ని రుసుములు చెల్లించి రిజిస్ట్రేషన్ కోసం కొత్తపల్లి ఎమ్మార్వో కార్యాలయానికి వెళితే సర్వే నంబర్ 432 ప్రభుత్వ భూమి ఖరీస్ ఖాతాలో ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేయను అంటూ తహసిల్దార్ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయమై ఆర్డిఓ, ఉన్నతాధికారులకు, సిసిఎల్ఏ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వాపోయారు. తాను రెవెన్యూ అధికారులపై ఫిర్యాదు చేసిన పాపానికి తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తమ సర్వే నెంబరుపై ఎలాంటి ఆంక్షలు లేవని జిల్లా రిజిస్టర్ కార్యాలయం నుండి సైతం సమాచారాన్ని తీసుకువచ్చి కొత్తపల్లి ఎమ్మార్వో, కరీంనగర్ ప్రస్తుత ఆర్డిఓకు చూపించినప్పటికీ ఉద్దేశపూర్వకంగా రిజిస్ట్రేషన్ ఆపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక పౌరుడిగా తాను తన కళ్ళ ముందు జరుగుతున్న భూ అక్రమణాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తే తనపై ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం చూస్తుంటే అధికారులు ఏ స్థాయిలో భూ అక్రమార్కులకు మద్దతు పలుకుతున్నారో అర్థమవుతుందని దీనిపై జిల్లా కలెక్టర్, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక దృష్టి సారించి తనకు న్యాయం జరిగేలా చూడాలని బాధితుడు దుర్గం మనోహర్ కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News