Tuesday, January 7, 2025
Homeపాలిటిక్స్BRS leaders: కేటీఆర్ విచారణ, బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ అందుకేనా?

BRS leaders: కేటీఆర్ విచారణ, బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ అందుకేనా?

అరెస్టు?

KTR విచారణ నేపథ్యంలో BRS నేతల ముందస్తు అరెస్ట్ పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే కౌశిక్‌రెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేసిన పోలీసులు, 100 మంది బీఆర్‌ఎస్‌ నేతల ముందస్తు అరెస్ట్‌ చేశారు. బీఆర్‌ఎస్వీ నేత మేకల విద్యాసాగర్‌ కూడా అరెస్ట్ అయ్యారు.

- Advertisement -

‌ఏం జరుగుతుంది?
కేటీఆర్ చుట్టూ ఈ-కార్ రేస్ కేసు బలంగా చుట్టుకున్నట్టు స్పష్టమవుతుండగా, నేడు విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు అందుకున్న కేటీఆర్ కు ఈడీ సైతం విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది, దీంతో రేపు ఈడీ విచారణను కేటీఆర్ ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. దీంత ముందు నుయ్యి వెనుక గొయ్యిగా మారింది ఆయన పరిస్థితి. విచారణకు సమయం కోరే అవకాశం ఉన్నా దానికి సంబంధిత అధికారులు ఒప్పుకుంటారా అన్నది ప్రశ్నార్థకమే.

ఏసీబీ-ఈడీ..

ఫార్ములా-ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఈ రేస్‌ కేసులు ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా మారాయి. ఒకవైపు యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) విచారిస్తుండగా, మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా కేసులో స్పీడ్‌ పెంచింది. సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. దీంతో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా లేదా అనేది సందిగ్ధంగా మారింది. అలాగే ఫార్ములా -ఈ రేసింగ్‌ కేసులో ఇటీవలనే కేటీఆర్‌కు ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది. విచారణకు కొన్ని రోజులు సమయం కోరుతారా లేక హాజరవుతారా అనేది సస్పెన్స్‌గా మారింది.
దానకిషోర్ స్టేట్‌మెంట్‌ ఆధారంగా విచారణ?
ఏసీబీ అధికారులు ఈ కేసు మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే ఏసీబీ అధికారులు ఐఏఎస్ అధికారి దానకిషోర్‌ను 7 గంటల పాటు విచారించారు. కీలక డాక్యుమెంట్లు సైతం స్వాధీనం చేసుకున్నారు. దానకిషోర్ చెప్పిన సమాధానాల ఆధారంగానే కేటీఆర్‌ను విచారించే అవకాశం ఉంది. ఒకవేళ కేటీఆర్ విచారణకు హాజరు అయితే మరికొన్ని కీలక సమధానాలను అధికారులు రాబట్టే అవకాశం ఉంది. ప్రాథమికంగా కొన్ని కీలక అంశాలపై దృష్టిపెట్టి రేస్ నిర్వహణకు ప్రతిపాదనలు ఎలా సిద్ధం చేశారు? నిధుల చెల్లింపు ఎలా? చేశారనే దానిపై వివరాలను సేకరించనున్నారు. ఉద్యోగుల పాత్ర ఏంటి ? అనే అంశాలపై లోతుగా అడిగే అవకాశం ఉంది. కేటీఆర్ విచారణ అనంతరం అవసరమైతే ఉద్యోగుల వాంగ్ములాలను కూడా రికార్డ్ చేసే అవకాశం ఉందని సమాచారం.
రేపు ఈడీ విచారణ
ఇక ఈడీ సైతం కేసును స్పీడప్ చేసింది. జనవరి 7న విచారణకు రావాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. అంతేకాకుండా ఈ కేసులో ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3 గా హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలకు కూడా నోటీసులు జారీ చేసింది. వీరిద్దరూ విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో కేటీఆర్‌ కూడా విచారణకు వెళ్లకుండా సమయం కోరే అవకాశం ఉంది.
ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
తనని అరెస్ట్ చేయవద్దని కేటీఆర్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అరెస్ట్ చేయవద్దని ఉన్నత న్యాయస్థానం కూడా ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ఏసీబీ కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. అనుమతులు లేకుండా ఏకపక్ష చెల్లింపులు చేశారని పేర్కొంది. ఫార్ములా-ఈ రేసు కేసు కొట్టివేయాలనే కేటీఆర్‌ పిటిషన్‌ను తిరస్కరించాలని హైకోర్టును ఏసీబీ కోరింది. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News