Saturday, March 29, 2025
Homeపాలిటిక్స్Varla Ramaiah: జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన వర్ల రామయ్య

Varla Ramaiah: జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన వర్ల రామయ్య

జగన్ వ్యాఖ్యలను వర్ల రామయ్య (Varla Ramaiah)తప్పుబట్టారు. వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు వైసీసీ మద్దతుదారుడు పవన్ కుమార్ ను పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. అయితే, విచారణ సమయంలో పోలీసులు తనను కొట్టారని పవన్ కుమార్ వైసీపీ అధినేత జగన్ వద్ద వాపోయాడు. అందుకు జగన్ స్పందిస్తూ ధైర్యంగా ఉండు, మనం మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. నిన్ను కొట్టిన ఆ డీఎస్పీ, ఆ సీఐతోనే నీకు సెల్యూట్ కొట్టిస్తా అని పవన్ కుమార్ తో అన్నారు.

- Advertisement -

జగన్ వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. జగన్ గారూ… ఓ కేసులో ముద్దాయిగా ఉన్న పవన్ అనే వ్యక్తిని పోలీసులు విచారిస్తే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సీఐ, డీఎస్పీతో ముద్దాయికి సెల్యూట్ కొట్టిస్తాననడం తగునా? అని ప్రశ్నించారు.

ఐదేళ్లు సీఎంగా రాష్ట్రానికి ఇలాగే చేశారా? పోలీసులను బ్లాక్ మెయిల్ చేస్తారా? అసాంఘిక శక్తిలా మాట్లాడతారా? అని వర్ల రామయ్య నిలదీశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News