ముంబై వాంఖడే స్టేడియంలో (Wankhede Stadium) ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో టీమ్‌ఇండియా యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొదటి బంతి నుంచే రెచ్చిపోయిన అభిషేక్.. ఫోర్లు, సిక్సర్లతో ఇంగ్లండ్ (England) బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఊచకోత అంటే ఎలా ఉంటుందో చూపించిన అభిషేక్.. బౌలర్ ఎవరైనా బౌండరీ లక్ష్యంగా బంతులను బాదేశాడు. ఈ మ్యాచులో అభిషేక్ శర్మ కేవలం 37 బంతుల్లో 10 సిక్సర్లు 5 ఫోర్లతో సెంచరీ నమోదు (Century entry) పూర్తి చేశాడు.
దీంతో అతను భారత జట్టు తరఫున అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ప్లేయర్ల జాబితాలో చేరాడు. అలాగే అతను వ్యక్తిగతంగా రెండో టీ20 సెంచరీ కూడా నమోదు చేసుకున్నాడు. అలాగే ఈ సెంచరీతో అంతర్జాతీయ టీ20లో అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసుకున్న బ్యాటర్‌గా అభిషేక్ నిలిచాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. ఈ మ్యాచులో అభిషేక్ శర్మ చివరి వరకు బ్యాటింగ్ చేస్తే మరికొన్ని రికార్డులు.. బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.