ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూలై 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని రంగంపేటలోని మాస్టర్ బ్యాడ్మింటన్ అకాడమీలో నాలుగు రోజులపాటు జరిగిన అండర్ 19 రాష్ట్రస్థాయి బాల బాలికల, మిక్స్ డబుల్ బ్యాడ్మింటన్ పోటీలు శుక్రవారం ముగిశాయి. పోటీలకు ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్యాధితులుగా హాజరై జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ ఐఏఎస్, మంచిర్యాల డిసిపి సుధీర్ రామ్నాథ్ కేకన్, పెద్దపల్లి ఏసిపి బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎడ్ల మహేష్, మంచిర్యాల ఏసిపి తిరుపతిరెడ్డి లతో కలిసి క్రీడాకాలను పరిచయం చేసుకొని మిక్సీ డబుల్స్ పోటీలను ప్రారంభించారు. ముందు జరిగిన ఫైనల్ పోటీలలో గెలిచిన వారికి అభినందనలు తెలిపారు.
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కాసేపు అడిషనల్ కలెక్టర్ రాహుల్, సుధీర్ రామ్నాథ్ కేకన్, ఏసిపి ఎడ్ల మహేష్ లతో కలిసి బ్యాడ్మింటన్ ఆడి అందర్నీ ఉత్తేజపరిచారు, విద్యార్థులు యువతీ యువకులు అందరూ క్రీడలలో రాణించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎప్పుడు క్రీడలను క్రీడకాలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. రానున్న రోజులలో మంచిర్యాల జిల్లాలో మరిన్ని రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించాలని కోరారు.