JAY SHAH| ఐసీసీ(ICC) కొత్త ఛైర్మన్గా జై షా నేడు బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఐసీసీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అతిపిన్న వయస్కుడిగా జై షా(36) గుర్తింపు దక్కించుకున్నారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఐదో వ్యక్తిగా జైషా నిలిచారు. చివరగా భారత్ నుంచి శశాంక్ మనోహర్ 2015-20 మధ్య ఐసీసీ చైర్మన్ పదవిలో ఉన్నారు. రెండు నెలల క్రితమే ఐసీసీ చైర్మన్గా జైషా ఎన్నిక కాగా..ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.
కాగా మూడు సార్లు రెండేళ్ల పాటు ఐసీసీ చైర్మన్గా అంటే గరిష్టంగా ఆరేళ్ల పాటు కొనసాగవచ్చు. గతంలో ఎన్. శ్రీనివాసన్ 2014 నుంచి 2015 మధ్య ఏడాది పాటు భారత్ నుంచి ఐసీసీ చైర్మన్గా కొనసాగారు. ఆ తరువాత శశాంక్ మనోహర్ 2015 నవంబర్ నుంచి జూన్ 2020 వరకు నాలుగేళ్లకు పైగా ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు జైషా ఎన్ని సంవత్సరాలు ఈ పదవిలో కొనసాగుతారో వేచి చూడాలి. అంతకుముదు జై షా బీసీసీఐ కార్యదర్శిగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా కొనసాగిన సంగతి తెలిసిందే.