Monday, January 6, 2025
HomeఆటJasprit Bumrah: భారత బౌలర్ బుమ్రా ఖాతాలో మరో రికార్డు

Jasprit Bumrah: భారత బౌలర్ బుమ్రా ఖాతాలో మరో రికార్డు

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లో టీమిండియా సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) అదరగొడుతున్నాడు. పదునైన బౌలింగ్‌తో ఆసీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. బాక్సింగ్ డే టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ వికెట్ తీసిన బుమ్రా టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 200 వికెట్లు పడగొట్టిన భారత పేసర్‌గా చరిత్ర సృష్టించాడు.

- Advertisement -

గతంలో ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ కపిల్‌ దేవ్ పేరిట ఉండేది. ఆయన 50 టెస్టు మ్యాచుల్లో ఈ రికార్డు సాధించాడు. ఇప్పుడు బుమ్రా కేవలం 44 టెస్టుల్లోనే 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఇక ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ ముందున్నాడు. 37 టెస్టుల్లోనే 200 వికెట్లు పడగొట్టాడు. మరో స్పిన్నర్ జడేజా 44 టెస్టుల్లో 200 వికెట్లు తీశాడు. కాగా ఓవరాల్‌గా ఈ రికార్డు పాకిస్థాన్ స్పిన్నర్ యాసిర్ షా పేరు మీద ఉంది. యాసిర్ 33 టెస్టుల్లోనే 200 వికెట్లు సాధించాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News