IND vs AUS| బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో(Border-Gavaskar Trophy) భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. ఇప్పటికే 321 పరుగుల లీడ్‌లో ఉంది. ఓవర్‌నైట్ 172/0 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 29 పరుగులు చేశాక తొలి వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (77)ను మిచెల్ స్టార్క్ ఔట్ చేశాడు. దీంతో యశస్వి- రాహుల్ 201 పరుగులు భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన దేవదత్ పడిక్కల్, యశస్వి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. వీరిద్దరు కలిసి 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 275/1 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైస్వాల్ (141), దేవదత్ పడిక్కల్ (25) ఉన్నారు. మూడో రోజు ఆటలో ఇంకా రెండు సెషన్లు మిగిలి ఉంది. దీంతో టీమిండియా దూకుడుగా ఆడి 450 పరుగులకు పైగా టార్గెట్ ఇస్తే ఆస్ట్రేలియా జట్టును ఓడించడం సులభం అవుతుంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులు, ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.