స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగే టీ20ల(IND vs ENG T20) సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టులోకి చాలా రోజుల తర్వాత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ రీఎంట్రీ ఇచ్చాడు. షమీ తన చివరి టీ20 మ్యాచ్ 2022 నవంబర్ నెలలో ఆడాడు. దాదాపు 14 నెలలుగా గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. మరోవైపు బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డికి టీ20 జట్టులో చోటు దక్కింది. అలాగే మరో తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు స్థానం లభించింది. ఇక ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈనెల 22 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్య, రింకు సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్ దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరున్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాసింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్
మ్యాచ్‌లు జరిగే తేదీలు:
జనవరి 22న తొలి టీ20(కోల్‌కతా)
జనవరి 25న రెండో టీ20(చెన్నై)
జనవరి 28న మూడో టీ20(రాజ్ కోట్)
జనవరి 31న నాలుగో టీ20(పుణె)
ఫిబ్రవరి 2న ఐదో టీ20(పుణె)