Sunday, May 12, 2024
HomeఆటBhupalapalli IPL betting: బంతి బంతికి బెట్టింగ్

Bhupalapalli IPL betting: బంతి బంతికి బెట్టింగ్

IPL సీజన్ వస్తే నష్టపోవాల్సిందేనా

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు జోరుగా బెట్టింగ్ లు క్షణాల్లో చేతులు మారుతున్న లక్షల రూపాయలు. చిత్తు చిత్తు అవుతున్న యువత కండ్లప్పగించి చూస్తున్న సంబంధిత అధికారులు.

- Advertisement -

ఐపిఎల్ క్రికెట్ సీజన్ వచ్చిందంటే చాలు యువత సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో బెట్టింగులకి అలవాటు పడి ఆర్ధికంగా చాలా నష్టపోతున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో భారీగా బెట్టింగులకి పాల్పడుతున్నారు.సాయంత్రం అయిందంటే చాలు 6 గంటల నుంచి రాత్రి 11 అయ్యే వరకి అడ్డాలుగా మారిన వివిధ షాపులలో గుంపులుగా కూర్చొని టేబుల్ బ్యాచులు టీమ్ లుగా కూర్చొని ధవాత్ లు చేసుకుంటూ కాయ్ రాజా కాయ్ అంటూ పందెం రాయుళ్లు. బెట్టింగుల ఉచ్చులో పడి యువత భారీగా నష్టపోతున్నారు. రోజువారీ పొద్దంతా కష్టాన్నీ సంపాదించుకొని సాయంత్రం అయిందంటే చాలు బెట్టింగు ఉచ్చులో పడి నష్టపోతుంన్నారు. ఫోన్లోనే టీమ్ ల వారీగా నువ్వెంత అంటే నేను ఇంతా అని మొదలుపెడతారు.

ఈ బెట్టింగులు ఎలా అంటే రెండు టీమ్ లలో టాస్ తో మొదలై ఏ టీం గెలుస్తుంది అనే వరకు పందెం కాస్తున్నారు. అంతే కాకుండా బంతి బంతికి బెట్టింగ్ ఆటగాళ్ల మీద కూడా పందెం నడుస్తుంది. ధోని,కోహ్లీ, ఇట్లా క్రేజీ ఉన్న ప్రతి ప్లేయర్ పై ఈ బెట్టింగులు సుమారు 1000 నుంచి మొదలుకొని ఒక్కొవ్యక్తి 50,000 వరకి మ్యాచ్ తీరుని బట్టి బెట్టింగు పెడుతున్నట్లు వినికిడి. కొంత మంది యువకులు బెట్టింగ్ ఆప్ ల్లో ఆన్లైన్లో అలవాటు పడి నష్టపోతున్నారు అని సమాచారం. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో యువత మానసికంగా కుంగిపోయి వ్యాసనాలకు అలవాటు పడుతున్నారు. మ్యాచ్ లు ఓడిపోయిన వారు అప్పులు తీసుకొని, మరికొందరు అయితే బంగారం, బైక్ లు,సైతం కుదవపెడుతూ రోడ్డున పడుతున్నారు. ముఖ్యంగా విచ్చలవిడిగా సాగుతున్న ఈ బెట్టింగుల వ్యవహారం మహదేవపూర్ సర్కిల్లలోనే అడ్డాలుగా ఏర్పర్చుకొని కొన్ని చుట్టూ పక్క ప్రాంతాలలో బెట్టింగులకి పాల్పడుతుండటంతో నిఘా లోపమా అనేది గమనార్హం.

అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడే వాళ్ళతో స్నేహాన్ని ఏర్పాటు చేసుకొని ఈ అడ్డాలని ఆసరా గా వాడుకొని సంబంధించిన అధికారులే చూసి చూడానట్లు ఇలా వ్యవరిస్తున్నారా..? అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కొంతమంది యువకులు మామూళ్ల రాయుళ్లు మాతో ఉన్నంత వరకి మాలాంటి పందెం రాయుళ్ళని అడిగేది ఎవరు అంటూ విచ్చలవిడిగా బెట్టింగులు నడిపిస్తున్నారు. ఈ బెట్టింగ్ వ్యవహారాల్లో నెలసరి మామూళ్లకి అలవాటు పడిన వారు ఇలాంటివి చూసి చూడనట్లు ఉంటున్నారు అనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారుల నిఘా లేకపోవడంతోనే పట్టణాలకే పరిమితం అని కాకుండా పల్లెల్లో కూడా ఈ బెట్టింగ్ దందా నడుస్తుంది. కాబట్టి బెట్టింగులు చేస్తూ యువత రోడ్డున పడుతున్నారు. అధికారులు స్పందించకపోవడంతో యువత తల్లిదండ్రులు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బెట్టింగులు జరుగుతున్న ప్రాంతాలపై బెట్టింగ్ రాయుళ్ల పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News