ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కేంద్రంలోని లాల్ పిచ్ మైదానంలో ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బిపిఎల్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ లో ఆటవిడుపుగా పోలీసులు పాత్రికేయుల మధ్యన ఫ్రెండ్లీ క్రికెట్ ఆడారు. పోలీసుల పక్షాన ఎస్సై ఎల్. ప్రవీణ్ కుమార్ కెప్టెన్ గా వ్యవహరించగా, పాత్రికేయులు పక్షాన ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడు సూది నరేష్ వ్యవహరించారు. మ్యాచ్ ఆద్యంతం కోలాహలంగా కొనసాగింది.